Jio IPL Recharge Plan 2025 : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తమ యూజర్ల కోసం సూపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది జియో. ఎంపిక చేసిన ప్లాన్లపై జియో వినియోగదారులు 90 రోజుల పాటు ఉచితంగా జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చని వెల్లడించింది. జియో సిమ్ ఉన్నవారు రూ.299 లేదా అంత కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ చూడవచ్చని తెలిపింది. అయితే, ఇప్పటివరకు ఉచితంగా చూస్తున్న అభిమానులకు మాత్రం జియోహాట్‌స్టార్ విలీనం రూపంలో షాక్ తగిలింది. మ్యాచ్‌ల కోసం కనీస సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అప్పటి వరకే ఛాన్స్!
రూ.299, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. పాత, కొత్త యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ప్రసారాలను ఉచితంగా వీక్షించొచ్చని తెలిపింది. ఇంకా మొబైల్, టీవీల్లో 4కే స్ట్రీమింగ్ సేవలు పొందొచ్చని వెల్లడించింది. దీంతో పాటు 50 రోజుల జియో ఫైబర్ సేవలను కూడా ఉచితంగా అందుకోవచ్చని రిలయన్స్ జియో వివరించింది. ఇందులో అపరిమిత వైఫై, 800ప్లస్ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్స్‌ను వీక్షించొచ్చని చెప్పింది. అయితే, మార్చి 17 నుంచి ఈనెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అయితే, కాంప్లిమెంటరీ జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే మార్చి 22న యాక్టివేట్ అయ్యి 90 రోజుల పాటు సేవలు లభిస్తాయని వివరించింది.
దీంతో పాటు ఐపీఎల్ ప్రసారాల కోసం ఇప్పటికే జియో పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇందులో రూ.100 ప్లాన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. దీని రీఛార్జితో 5జీబీ డేటా వస్తుంది. అయితే ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే అని ఎటువంటి కాల్స్, ఎస్సెమ్మెస్‌ల సదుపాయం ఇందులో ఉండదని చెబుతోంది. ఇక, రూ.949 ప్లాన్ పైనా ఇలాంటి ఆఫర్ అందిస్తుండగా తాజాగా మరిన్ని ప్లాన్లకు ఈ కాంప్లిమెంటరీ సేవలను జియో విస్తరించింది.
ఇకపై మారుమూల ప్రాంతాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్- స్టార్‌లింక్‌తో జియో బిగ్ డీల్
స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ డీల్- ఇకపై ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్!