ETV Bharat / business

మీకు ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా? - పాన్ నంబర్​తో ఇలా చిటికెలో స్టేటస్ తెలుసుకోండి! - Income Tax Refund Status Check

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 5:16 PM IST

ITR Refund Status Check : ఐటీఆర్​ ఫైల్ చేసి రిఫండ్​ కోసం ఎదురు చూస్తున్నారా? మీ రిఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలో తెలియడం లేదా? డోంట్​ వర్రీ. ఈ స్టోరీలో మేము చెప్పే ఈ పద్ధతులు ఫాలో అయ్యి చాలా ఈజీగా ఐటీఆర్ రిఫండ్ స్టేటస్ చెక్​ చేసుకోండి. ​

How To Check Income Tax Refund Status
ITR Refund Status Check (ETV Bharat)

How To Check Income Tax Refund Status : గత ఆర్థిక సంవత్సరానికి(2023-24) సంబంధించి ఐటీఆర్(ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్​లు) ఫైల్ చేసి.. రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అలాగే.. మీ రిటర్నుల ప్రాసెసింగ్ ఏ స్టేజ్​లో ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకోసం మీరు ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదని.. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే చాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాన్​ కార్డుతో చిటికెలో మీ ఐటీఆర్ రీఫండ్(ITR Refund) స్టేటస్​ను​ చెక్​ చేసుకోవచ్చంటున్నారు. అదెలాగంటే..

పాన్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్​లో రెండు మార్గాల ద్వారా ఈజీగా ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందులో ఒకటి.. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా, మరొకటి.. ఎన్ఎస్​డీఎల్ టిన్ వెబ్‌సైట్ ద్వారా సింపుల్​గా రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే, ఐటీ రీఫండ్ స్టేటస్ తెలుసుకోవడానికి ముందు మీకు ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యేందుకు వాలిడ్ ఐడీ, పాస్‌వర్డ్​ కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ పాన్ కార్డు కచ్చితంగా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలి. అలాగే మీ ఐటీఆర్ ఫైలింగ్ అక్‌నాలెడ్డ్‌మెంట్ నంబర్ అవసరమవుతుందనే విషయాన్ని గమనించాలి.

ఇ-ఫైలింగ్ పోర్టల్‌ ద్వారా ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా:

  • ఇందుకోసం మీరు ముందుగా ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్​ని https://www.incometax.gov.in/iec/foportal/ సందర్శించాలి.
  • అనంతరం Login బటన్​పై క్లిక్​ చేసి.. మీ యూజర్ ఐడీ (పాన్​ కార్డు నంబర్), పాస్​​వర్డ్​ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • తర్వాత స్క్రీన్​ మీద మీ వివరాలు కనిపిస్తాయి. అందులో e- File ఆప్షన్​పై క్లిక్​ చేసి అందులో Income Tax Returns ఆప్షన్​లో View Filed Returns పై క్లిక్​ చేయాలి.
  • అనంతరం మీ ఐటీఆర్​​కు సంబంధించిన 'అసెస్​మెంట్​ ఇయర్​'ను ఎంటర్​ చేసి సబ్​​మిట్​ బటన్ ప్రెస్ చేయాలి.
  • ఇందులో మీ ఐటీఆర్ రీఫండ్​ స్టేటస్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అంతే సింపుల్!

మీకు ఇంకా ఐటీ రిఫండ్​ రాలేదా? రీ-ఇష్యూ కోరండిలా!

ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్ ద్వారా రీఫండ్ స్టేటస్ తెలుసుకోండిలా..!

  • ఇందుకోసం ముందుగా మీరు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ వెబ్‌సైట్​ని https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan.html సందర్శించాలి.
  • ఆ తర్వాత అందులో మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి అసెస్మెంట్ ఇయర్ నమోదు చేయాలి.
  • అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేసి.. ప్రొసీడ్​ అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అంతే.. మీ రీఫండ్ స్టేటస్​కు సంబంధించిన వివరాలు డిస్ ప్లేపై కనిపిస్తాయి.

అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. మొదట ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి అయ్యాకే రిఫండ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి.. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితేనే మీకు రావాల్సిన రిఫండ్ మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుందనే విషయాన్ని గమనించాలి.

ITR ఫైలింగ్​కు ముందు ఈ డేటా చెక్​ చేసుకున్నారా? లేదంటే ఐటీ నోటీసులు వస్తాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.