Gold Rate Today June 9th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,400 ఉండగా, సోమవారం నాటికి రూ.580 తగ్గి రూ.98,820కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.1,08,075 ఉండగా, సోమవారం నాటికి రూ.275 తగ్గి రూ.1,07,800కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 9th 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.98,820గా ఉంది. కిలో వెండి ధర రూ.1,07,800గా ఉంది.
- Gold Price In Vijayawada June 9th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.98,820గా ఉంది. కిలో వెండి ధర రూ.1,07,800గా ఉంది.
- Gold Price In Visakhapatnam June 9th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.98,820గా ఉంది. కిలో వెండి ధర రూ.1,07,800గా ఉంది.
- Gold Price In Proddatur June 9th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.98,820గా ఉంది. కిలో వెండి ధర రూ.1,07,800గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 9th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 3,310 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 3309 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 36.01 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్ఠ
Stock Market Today 9th June 2025 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, ప్రస్తుతం ఐటీ, బ్యాంకింగ్స్ స్టాక్స్ రాణిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 302 పాయింట్లు లాభపడి 82,482 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 116 పాయింట్లు వృద్ధి చెంది 25,120 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ
- నష్టాల్లో ఉన్న షేర్లు : భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ
Rupee Value June 9th 2025 : ఇవాళ రూపాయి విలువ 8 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.60గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices June 9th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.