Gold Rate Today April 28th 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,080 ఉండగా, సోమవారం నాటికి రూ.580 తగ్గి రూ.98,500కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.99,600 ఉండగా, సోమవారం నాటికి రూ.620 తగ్గి రూ.98,980కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 28th 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.98,500గా ఉంది. కిలో వెండి ధర రూ.98,980గా ఉంది.
- Gold Price In Vijayawada April 28th 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.98,500గా ఉంది. కిలో వెండి ధర రూ.98,980గా ఉంది.
- Gold Price In Visakhapatnam April 28th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.98,500గా ఉంది. కిలో వెండి ధర రూ.98,980గా ఉంది.
- Gold Price In Proddatur April 28th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.98,500గా ఉంది. కిలో వెండి ధర రూ.98,980గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 28th 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 3,319 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 26 డాలర్లు తగ్గి 3,293 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.84 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 28th 2025 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, ఆటో, ఫార్మా స్టాక్స్ రాణిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి 79,619 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి చెంది 24,128 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్
- నష్టాల్లో ఉన్న షేర్లు : హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్,
రూపాయి విలువ
Rupee Value Today April 28th 2025 : శుక్రవారం రూపాయి విలువ 12 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.29గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices April 28th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
అక్షయ తృతీయ ఆఫర్- ఫోన్‌పే & పేటీఎంలో గోల్డ్ కొంటే భారీ డిస్కౌంట్ & క్యాష్‌బ్యాక్
అక్షయ తృతీయ నాడు బంగారం కొనే ఆలోచన ఉందా? - బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలో తెలుసా?