ETV Bharat / business

దేశంలో తొలిసారిగా సిమ్​-లెస్​ 'క్యూ-5జీ'​ సేవలు- స్పీడ్​, ధర వివరాలు ఇవే! - BSNL SIM LESS Q5G SERVICE

సిమ్ రహిత 'క్యూ-5జీ'ని తీసుకొచ్చిన బీఎస్ఎన్‌ఎల్- తొలివిడతగా హైదరాబాద్‌లో సర్వీసులకు శ్రీకారం- 2025 సెప్టెంబరుకల్లా మరిన్ని నగరాలకు సేవల విస్తరణ

BSNL
BSNL (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 23, 2025 at 12:05 PM IST

3 Min Read

BSNL SIM Less Q5G Service : దేశంలోనే తొలిసారిగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సిమ్ రహిత 'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ'(Q-5G) సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌డబ్ల్యూఏ అంటే 'ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్' అని అర్థం. తొలి విడతగా ఈ సేవలు హైదరాబాద్‌ నగరంలో పరిమిత స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ సిమ్ రహిత 5జీ సర్వీసును సబ్‌స్క్రయిబ్ చేసుకునే వారికి 5జీ రేడియో యాక్సెస్ టెక్నాలజీ ద్వారా ఫైబర్ నెట్ తరహాలో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. తదుపరి విడతల్లో 2025 సెప్టెంబరుకల్లా ఈ సర్వీసును బెంగళూరు, పుదుచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నారు.

ప్రారంభించిన బీఎస్ఎన్‌ఎల్ సీఎండీ
'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ' సర్వీసును జూన్ 18న హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎ‌ల్ అమీర్‌పేట్ ఎక్స్ఛేంజిలో బీఎస్ఎన్‌ఎల్/ఎంటీఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ.రాబర్ట్ జె.రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్‌ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, తెలంగాణ సీజీఎం, కేంద్ర టెలికాం శాఖ ఉన్నతాధికారులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. క్వాంటమ్ 5జీ సర్వీసులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.bsnl.co.in, www.telangana.bsnl.co.in వెబ్‌సైట్లను చూడొచ్చు. లేదంటే మీ సమీపంలోని బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటరును సంప్రదించొచ్చు.

స్పీడ్, నెలవారీ ప్లాన్ల వివరాలివీ

  • క్యూ- 5జీ సర్వీసు అమీర్‌పేట్ పరిధిలో 10 మిల్లీ సెకన్లలోనే 980 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్, 140 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌‌ను అందిస్తోంది.
  • అల్ట్రా హెచ్‌డీ టీవీలు చూడటానికి, వర్క్ ఫ్రం చేసుకోవడానికి, క్లౌడ్ గేమింగ్‌కు కూడా ఈ సర్వీసు దోహదకరంగా ఉంటుంది.
  • 100 ఎంబీపీఎస్ స్పీడ్ కలిగిన 'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ' సర్వీసు కోసం ప్రతినెలా రూ.999, 300 ఎంబీపీఎస్ స్పీడ్ కలిగిన సర్వీసుకు నెలకు రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది.
  • బీఎస్ఎన్‌ఎల్ టవర్ గ్రిడ్‌ను వినియోగించుకొని, నేరుగా యూజర్ల ఇళ్లలోకి వైర్‌లెస్ రేడియో వేవ్ ఇంటర్నెట్ బీమ్‌లను పంపిస్తారు. తద్వారా ఎటువంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అక్కర లేకుండానే యూజర్ల ఇంటి దాకా ఇంటర్నెట్ చేరిపోతుంది. బీఎస్ఎన్ఎల్ అందించే గేట్‌వే డివైజ్‌‌లో యూజర్లు కేవలం ప్లగ్ పెట్టుకుంటే సరిపోతుంది.
  • హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు 85 శాతం ఇళ్లను తమ టవర్ గ్రిడ్ కవర్ చేస్తుందని, వాళ్లంతా 'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ' సర్వీసులను పొందొచ్చని బీఎస్ఎన్‌ఎల్ వెల్లడించింది.

క్యూ- 5జీలోని ఇతర ఫీచర్లు

  • 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్‌లో భాగంగా సిమ్ రహిత 'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ'(Q-5G) టెక్నాలజీని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • ఇందుకోసం ప్రత్యేకమైన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(RAN), కామన్ ప్లాట్‌ఫామ్ ఎన్యుమరేషన్ (CPE)లను తయారు చేశారు. వాటన్నింటిని కలిపి సిమ్ లేకుండా పనిచేసే 'క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ' టెక్నాలజీని ఆవిష్కరించారు.
  • నెట్‌వర్క్ స్లైసింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ కమ్యూనికేషన్ (URLLC) వంటి ఫీచర్లతో కూడిన '5జీ ఎస్‌ఏ కోర్' అనేది Q-5G సర్వీసుల్లో ఉందని బీఎస్ఎన్‌ఎల్ వెల్లడించింది.
  • ఎంఎస్ఎంఈలు, స్మార్ట్ తయారీ క్లస్టర్ల కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్లను తాము అందించగలమని తెలిపింది.
  • తొలివిడతగా హైదరాబాద్‌లో యూజర్ల నుంచి లభించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దేశంలోని ఇతర నగరాలకు Q-5G విస్తరించాలని బీఎస్ఎన్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

క్వాంటమ్ 5జీ భారతీయ ఇంజినీర్ల ఘనత
"భారతీయ ఇంజినీర్లు ప్రపంచస్థాయి ఇంటర్నెట్ కనెక్టివిటీని సృష్టించగలరు అనేందుకు మా క్వాంటమ్ 5జీ సర్వీసులే నిదర్శనం. ఇది మొట్టమొదటి సిమ్ రహిత ఇంటర్నెట్ సర్వీసు. బీఎస్ఎన్‌ఎల్ కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దీన్ని రూపొందించాం. టెకీలు, టెక్ కంపెనీలు లక్ష్యంగా ఈ సర్వీసును తొలి విడతగా హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చాం. ఇది పరిమిత స్థాయి విడుదల మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు క్వాంటమ్ 5జీ సేవలను విస్తరిస్తాం. ఈ సర్వీసులోని ఫీచర్లను కూడా అప్‌గ్రేడ్ చేస్తాం" అని బీఎస్ఎన్‌ఎల్/ఎంటీఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ.రాబర్ట్ జె.రవి తెలిపారు.

రూ.12 లక్షలు పెడితే రూ.40 లక్షలు రిటర్న్​​- భారీ లాభాలిచ్చే టాప్- 5 మిడ్‌క్యాప్ ఫండ్స్ ఇవిగో

ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలా? 5 గోల్డెన్ పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఇవిగో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.