ETV Bharat / business

ఏడాదికి కోటి పెళ్లిళ్లు - రూ.10లక్షల కోట్ల వ్యాపారం - భారత్​లో అట్లుంటది మరి! - Indian Wedding Costs

Indian Wedding Costs : భారతదేశంలో వివాహాలు అంగరంగ వైభోగంగా చేసుకోవడం సర్వసాధారణం. ధనికులు, సామాన్యులు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరూ వివాహం కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. ఇండియాలో ఒక ఏడాదిలో జరిగే వివాహాల వల్ల ఏకంగా రూ.10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఒక అంచనా.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 4:58 PM IST

The Big Fat Indian Wedding
How Much Does the Average Marriage Cost in India? (ETV Bharat)

Indian Wedding Costs : భారతీయులకు వివాహం అత్యంత పవిత్రమైనది. అందుకే సంప్రదాయబద్ధంగా బంధు, మిత్రులను పిలుచుకుని ఉన్నంతలో చక్కగా పెళ్లి చేసుకునేవారు. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల నేడు వివాహ వేడుకలు భారీ ఆడంబరాలతో చేసుకుంటున్నారు. ఫలితంగా పెళ్లిళ్లు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ఒక ఏడాదిలో పెళ్లిళ్ల సీజన్​లో వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఓ నివేదిక అంచనా వేసింది. భారత్​లో ఆహారం, కిరాణా వస్తువుల కొనుగోలు తర్వాత వివాహ ఖర్చులే రెండో స్థానంలో ఉన్నాయి. సగటు భారతీయుడు విద్య కంటే వివాహ వేడుకలకే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడట. అలాగే భారత్​లో ఒక ఏడాదికి 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతున్నాయట.

చైనా కంటే భారత్​లోనే పెళ్లిళ్లు ఎక్కువ
ఏడాదికి చైనాలో 70-80 లక్షల వివాహాలు, అమెరికాలో 20-25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమెరికాలో మ్యారేజ్​ బిజినెస్ (70 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే భారత్​లో పెళ్లిళ్ల సీజన్​లో జరిగే వ్యాపారం (130 బిలియన్ డాలర్లు) దాదాపు రెట్టింపు ఉంటుంది. చైనా పెళ్లిళ్ల బిజినెస్ మాత్రం 170 బిలియన్ డాలర్లు వరకు ఉంటుందని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారం, కిరాణా వ్యాపారం (681 బిలియన్ల డాలర్లు) తర్వాత రెండో అతిపెద్ద రిటైల్ కేటగిరీగా వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా జరిగే వ్యాపారం నిలిచింది.

అందుకే ఖర్చుకు వెనకాడరు!
భారతదేశంలో వివాహాలు సంప్రదాయబద్దంగా జరుగుతాయి. వివాహ వేడుకను భారీగా ఖర్చు పెట్టి జరుపుకుంటారు. ఆభరణాలు, దుస్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే వివాహాల వల్ల ఎలక్ట్రానిక్, ఆహార ఉత్పత్తుల వ్యాపారం కూడా పెరుగుతుంది. వివాహాలకు అయ్యే ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పుటికీ అది సాధ్యం కావడం లేదు. ఇతర దేశాలకు వెళ్లి కొందరు భారతీయులు అత్యంత ఆడంబరంగా వివాహాలు చేసుకుంటున్నారు.

రూ.10 లక్షల కోట్ల బిజినెస్!
"ఏటా భారతదేశంలో 80 లక్షల నుంచి కోటి వివాహాలు జరుగుతాయి. వివాహ సంబంధిత కొనుగోళ్లు, సేవల ద్వారా దాదాపుగా రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్లు) వ్యాపారం జరుగుతుంది. భారతీయ వివాహాలు కొన్ని రోజుల పాటు జరుగుతుంటాయి. అలాగే సంగీత్, ప్రీ వెడ్డింగ్ వంటి కార్యక్రమాలను చేసుకుంటారు. తమ ఆర్థిక స్థితిని బట్టి సాధారణ స్థాయి నుంచి అత్యంత ఆడంబరంగా, వైభవంగా వివాహాలు చేసుకుంటారు" అని బ్రోకరేజ్ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.

కొన్ని నెలల్లోనే ముహుర్తాలు
చాంద్రమానాన్ని అనుసరించే హిందూ క్యాలెండర్ ఆధారంగా పెళ్లిళ్ల ముహూర్తాలు ఉంటాయి. కొన్ని నిర్దిష్ట నెలల్లో మాత్రమే భారత్​లో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. వివాహాన్ని భారతీయులు పవిత్రంగా భావిస్తారు. అందుకే వివాహాల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు. వివాహాల విషయంలో వారి ఆదాయం, ఆర్థిక పరిపుష్ఠిని కొందరు పట్టించుకోరు.

అమెరికావాసుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు
అమెరికా వాసులు వివాహానికి సగటున 15 వేల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. కానీ భారతీయులు వివాహం కోసం విద్య కంటే రెండు రెట్లు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే విదేశాల్లో పెళ్లి చేసుకునేవారు విలాసవంతమైన వసతులు, హోటల్స్, క్యాటరింగ్, సెలబ్రిటీల ప్రదర్శనల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

వీటికే ఎక్కువ బిజినెస్
భారతదేశంలో ఆభరణాలు, దుస్తులు, క్యాటరింగ్, బస, ప్రయాణం వంటి వాటికి పెళ్లిళ్ల సీజన్​లో బాగా డిమాండ్ ఉంటుంది. కనుక ఈ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతుంటాయి. ఆభరణాల పరిశ్రమకు వచ్చే ఆదాయంలో సగానికిపైగా వధువు కోసం కొనుగోలు చేసిన నగలు ద్వారానే వస్తుంది. దుస్తుల కొనుగోలు మొత్తంలో 10 శాతం వివాహాలు కోసమే కొంటారు. పెళ్లిళ్ల వల్ల భారత్​లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్ మొదలైన రంగాలు కూడా వృద్ది చెందుతున్నాయి.

పేదల సామూహిక వివాహాలకు అంబానీ ఫ్యామిలీ ప్లాన్- సంగీత్​లో అనంత్- రాధిక లవ్ స్టోరీ స్పెషల్ డ్యాన్స్​! - Anant Radhika Wedding

బంగారంతో ఆకాశ్ వెడ్డింగ్ కార్డ్​- బిలియనీర్ కొడుకు పెళ్లి అంటే ఉండాలిగా! - Anant Ambani Radhika Merchant

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.