ETV Bharat / business

జూన్ 6,7,8 తేదీల్లో బ్యాంకులకు సెలవులు- ఎందుకో తెలుసా? - BANK HOLIDAYS IN JUNE 2025

జూన్ నెలలోనూ బ్యాంకులకు వరుస సెలవులు

bank holidays in june 2025
bank holidays in june 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 5, 2025 at 3:31 PM IST

2 Min Read

Bank Holidays in June 2025 : మీకు బ్యాంక్​కు వెళ్లే పని ఉందా? అయితే బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. బక్రీద్ (ఈదుల్ అధా) పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం జూన్ 7న పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ నెల మొదటి శనివారం రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2025 సంవత్సరానికి జారీ చేసిన సెలవుల జాబితా ప్రకారం బ్యాంకులు జూన్ 6 (శుక్రవారం) లేదా 7న(శనివారం) బక్రీద్ సెలవును అమలు చేయొచ్చు.

కేరళలో మాత్రమే సెలవు
ఈ నేపథ్యంలో జూన్ 6న ఒక్క కేరళ రాష్ట్రంలోని బ్యాంకులకు బక్రీద్ సెలవు ఉంటుంది. శుక్రవారం రోజున కేరళ రాష్ట్రంలోని బ్యాంకులు పనిచేయవు. ఇక దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో జూన్ 7న బక్రీద్ సెలవు అమలవుతుంది. అయితే శనివారం రోజున కొచ్చి, తిరువనంతపురం, అహ్మదాబాద్, గాంగ్‌టక్, ఈటానగర్‌లలో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.

జూన్ 8న కూడా బంద్ అని గుర్తుంచుకోండి
జూన్ 8న (ఆదివారం) కూడా బ్యాంకులు బంద్ ఉంటాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం తమ బ్యాంకు వ్యవహారాలను ముందస్తుగా చక్కబెట్టుకోవాలి. మొత్తం మీద జూన్ నెలలోనూ బ్యాంకులకు దాదాపు 11 సెలవులు (ఆదివారాలు సహా) రాబోతున్నాయి. అయితే ఈ సెలవుల అమలు అనేది రాష్ట్రాన్ని బట్టి మారిపోతుంది. ప్రాంతీయ ప్రాధాన్యత ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులను అమలు చేస్తాయి.

2025 జూన్‌లో బ్యాంకు సెలవులివీ

  • బక్రీద్ - జూన్ 6న (కేరళ)
  • బక్రీద్ - జూన్ 7న (కేరళ మినహా అన్ని రాష్ట్రాలు)
  • సంత్ గురు కబీర్ జయంతి/ సాగా దావా -జూన్ 11 (సిక్కిం, హిమాచల్ ప్రదేశ్)‌
  • రథ్ యాత్ర/ కాంగ్ - జూన్ 27 (ఒడిశా, మణిపూర్)
  • రేమ్నా నీ - జూన్ 30 (మిజోరం)
  • ఆదివారాలు - జూన్ 1, 8, 15, 22, 29
  • రెండో శనివారం - జూన్ 14
  • నాలుగో శనివారం - జూన్ 28

రిస్క్​ లేకుండా నెలనెలా ఆదాయం కావాలా? - ఈ స్కీమ్​పై లుక్కేయండి - ఆకర్షణీయమైన వడ్డీ!

మే నెలలో రికార్డ్ స్థాయి UPI ట్రాన్సాక్షన్లు- గతేడాదితో పోలిస్తే 23 శాతం పెరిగిన లావాదేవీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.