2024 ఆగస్టు నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In August 2024
Bank Holidays In August 2024 : బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. 2024 ఆగస్టు నెలలో ఏకంగా 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ ఖాతాదారులు ఇప్పటి నుంచే తమ ఆర్థిక లావాదేవీల షెడ్యూల్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు బ్యాంక్‌లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : July 29, 2024 at 2:52 PM IST
Bank Holidays In August 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 ఆగస్టు నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In August 2024
2024 ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- ఆగస్టు 4 (ఆదివారం) : దేశంలోని అన్ని బ్యాంకలకు సెలవు. కేరళలో కర్కిడక వావుబలి పండుగ కూడా ఇవాళే జరుపుకుంటారు.
- ఆగస్టు 7 (బుధవారం) : హరియాలీ తీజ్ పండుగ సందర్భంగా హరియాణాలోని బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 8 (గురువారం) : 'టెండాంగ్ లో రమ్ ఫాత్' ఉత్సవం సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 10 (రెండో శనివారం) :
- ఆగస్టు 11 (ఆదివారం) :
- ఆగస్టు 13 (మంగళవారం) : దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపుర్‌లోని బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 15 (గురువారం) : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- ఆగస్టు 16 (శుక్రవారం) : 'డి జ్యూర్ ట్రాన్స్ఫర్ డే' సందర్భంగా పుదుచ్చేరిలోని బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 18 (ఆదివారం) :
- ఆగస్టు 19 (సోమవారం) : రక్షా బంధన్ (రాఖీ పండుగ) సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులన్ పూర్ణిమ సందర్భంగా ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.
- ఆగస్టు 24 (నాలుగో శనివారం) :
- ఆగస్టు 25 (ఆదివారం) :
- ఆగస్టు 26 (సోమవారం) : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays : ఆగస్టు నెలలో 13 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.

