ETV Bharat / business

గూగుల్ నుంచి రూ.2లక్షల కోట్ల ఆఫర్​ - కానీ నో చెప్పిన స్టార్టప్ - ఎందుకో తెలుసా? - Wiz Rejected Google Offer

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 4:37 PM IST

Wiz Rejected Google Offer : గూగుల్ కంపెనీ ఇచ్చిన 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) ఆఫర్​ను విజ్​ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ తిరస్కరించింది. ఇంత భారీ ఆఫర్​ను ఆ స్టార్టప్ కంపెనీ తిరస్కరించడానికి కారణం ఏమిటో తెలుసా?

GOOGLE
GOOGLE (Getty Images)

Wiz Rejected Google Offer : ప్రపంచ అగ్రగామి సంస్థ గూగుల్ నుంచి వచ్చిన భారీ ఆఫర్​ను విజ్ అనే సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తిరస్కరించింది. 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు)కు గూగుల్ ఇచ్చిన ఆఫర్​ను వదులుకుంది. ఆ కంపెనీ ఎందుకు గూగుల్ ఆఫర్​ను తిరస్కరించింది? విజ్ స్టార్టప్ కొనుగోలుకు గూగుల్ అంత పెద్ద మొత్తం ఇవ్వజూపడానికి గల కారణాలేమిటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సైబర్ సైక్యూరిటీ స్టార్టప్ 'విజ్'ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. విజ్​కు 23 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఇదే కనుక జరిగితే ఈ ఒప్పందం గూగుల్ అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటి అయ్యుండేది. అయితే విజ్ సహ వ్యవస్థాపకుడు అసాఫ్​ రాపాపోర్ట్ గూగుల్ ఆఫర్​ను తిరస్కరించడానికి గల కారణాన్ని, తమ సంస్థ సిబ్బందికి పంపిన అంతర్గత మోమోలో వెల్లడించినట్లు సీఎన్​బీసీ తన నివేదికలో పేర్కొంది. అందులో ఏముందంటే?

నో చెప్పడం కష్టమే - కానీ
విజ్ కంపెనీ ఐపీఓకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అసాఫ్​ రాపాపోర్ట్ సిబ్బందికి పంపిన మోమోలో తెలిపారు. 'గూగుల్ ఆఫర్​కు నో చెప్పడం కష్టమే. విజ్ ఇప్పుడు గూగుల్ ఆఫర్‌ కంటే, ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యంపై దృష్టి సారిస్తోంది. ఐపీఓతో పాటు, వార్షిక రికరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది' అని అసాఫ్​ ఉద్యోగులకు పంపిన మోమోలో రాసికొచ్చినట్లు సీఎన్​బీసీ నివేదికలో పేర్కొంది. అయితే ఈ డీల్​ గురించి గూగుల్ కానీ, విజ్​ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

విజ్​ పట్ల గూగుల్​కు ఎందుకంత ఆసక్తి?
గత కొన్నేళ్లుగా క్లౌడ్ బేస్డ్​ సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్​లో విజ్ అగ్రగామిగా ఉంది. తొలుత ఇజ్రాయెల్​లో స్థాపితమైన ఈ సంస్థ, ప్రస్తుతం న్యూయార్క్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్​లో విజ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఫార్చ్యూన్ 100 కంపెనీలలో 40శాతం కంపెనీలు విజ్ క్లయింట్​లుగా ఉన్నాయి. తాజాగా 1 బిలియన్ డాలర్ల నిధుల సేకరణ తర్వాత విజ్​ కంపెనీ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది.

అమెరికా, యూరప్, ఆసియా, ఇజ్రాయెల్​లో కలిపి విజ్ కంపెనీలో దాదాపు 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ, డాక్యుసైన్‌ తో సహా ప్రముఖ కంపెనీలు విజ్​కు క్లయింట్​లుగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. పైగా సాఫ్ట్​వేర్ కంపెనీ హబ్​స్పాట్​ను గూగుల్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి, విఫలమైంది. అందువల్ల విజ్​ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. ముఖ్యంగా క్లౌడ్ బేస్డ్​ సేవలను విస్తరించడానికి, మార్కెట్లోని పోటీని ఎదుర్కొనేందుకు విజ్​ను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Cars Under 7 Lakh

పొదుపు Vs పెట్టుబడి - సంపద సృష్టించడానికి ఏది బెటర్ ఆప్షన్? - Saving Vs Investing

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.