ETV Bharat / business

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ టాప్​-10 ఫైనాన్సియల్​ టిప్స్​ మీ కోసమే! - New Employee Financial Saving Tips

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 2:24 PM IST

Financial Saving Tips A New Employee Must Know : కొత్తగా ఉద్యోగంలో చేరారా? మీ నెలవారీ పొదుపులపై సాధ్యమైనంత ఎక్కువ రాబడులను ఆర్జించాలని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం చాలా పెట్టుబడి మార్గాలు రెడీగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

Financial Saving Tips a New Employee Must Know
Employees (ETV Bharat)

Financial Saving Tips A New Employee Must Know : మీరు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారా? మీకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు, మదుపు చేయాలని అనుకుంటున్నారా? లాభాలు పండించే సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? అయితే మీరు ఈ కథనాన్ని చదవాల్సిందే.

మూడు ఏర్పాట్లు తప్పనిసరి
మీరు అత్యుత్తమ పెట్టుబడి మార్గాలను అన్వేషించే ముందు కొన్ని కనీస స్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అందులో మొదటిగా మీ అత్యవసరాల కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మీ కుటుంబం మొత్తానికి 12 నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్‌లో దాచుకోవాలి. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా సేవింగ్స్ అకౌంటులో ఉంచుకోవాలి. తప్పకుండా ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఈ పాలసీని క్లెయిమ్ చేస్తే వచ్చే మొత్తం అనేది మీ వార్షిక ఆదాయానికి 17 నుంచి 20 రెట్లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల మీకు ఏదైనా జరగరానిది జరిగితే, మీ కుటుంబం అవసరాలను తీర్చేంత పరిహారం లభిస్తుంది. మీకు అత్యవసర చికిత్సలు అవసరమైతే సహాయపడే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాలి. కనీసం రూ.10 లక్షల వైద్య చికిత్సలకు కవరేజీని అందించేలా ఈ పాలసీ ఉండాలి. వీలైతే రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వైద్యచికిత్సల కవరేజీని అందించే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం బెటర్.

ఈక్విటీతో మొదలు
పెట్టుబడి ప్రపంచంలో తొలి మెట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్​ను ఎంచుకోవడం బెటర్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మీరు మొదటిదా సిస్టమేటిక్​ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లో పెట్టుబడులు పెట్టొచ్చు.పెట్టుబడి కోసం ప్రతినెలా మీరు కేటాయించుకునే మొత్తంలో 90 శాతాన్ని ఈక్విటీలలో, 10 శాతాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ సంపాదనలో ఇంకా మిగిలిన భాగాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లోకి మళ్లించండి. తొలిసారి పెట్టుబడులు పెట్టేవారు తమ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంటును పూర్తిగా 100 శాతం ఈక్విటీలకే కేటాయించాలని కొంతమంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇది పూర్తిగా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని మీరు గుర్తించుకోవాలి. దీర్ఘకాలిక వ్యూహంతో మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌ సిప్‌లో మీరు పెట్టుబడి పెడితే 14 శాతం నుంచి 15 శాతం మేర రాబడి లభించే అవకాశం ఉంది. మీరు లిక్విడ్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తే 4 శాతం నుంచి 5 శాతం ఆదాయం రావచ్చు.

రెండు రకాల సిప్‌లు
సిప్‌లలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం దాన్ని ‘స్టాటిక్ సిప్’ అంటారు. ఇది సాధారణమైంది. దీని ద్వారా ప్రతినెలా నిర్దిష్ట మొత్తాన్ని మీరు పెట్టుబడులు పెట్టాలి. ఇక రెండో రకం దాన్ని ‘స్టెప్​ అప్ సిప్’ అని పిలుస్తారు. దీని ద్వారా రానున్న నెలల్లో మీ నెలవారీ పెట్టుబడి మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందనే స్పష్టమైన అంచనా ఉన్నవాళ్లకు ‘స్టెప్​ అప్ సిప్’ సరిగ్గా సరిపోతుంది.

రిస్క్ తీసుకోలేరా? మీకోసం హైబ్రిడ్ ఫండ్
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి ఆందోళనకు లోనయ్యేవారు పెట్టుబడి పెట్టేందుకు బెస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా, నగదు లభ్యత తక్కువగా ఉన్నవారు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాంటి వారు పెట్టుబడి కోసం కేటాయించుకున్న మొత్తంలో 50 శాతాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకోవాలి. మిగతా మొత్తాన్ని బ్లూ చిప్ కంపెనీలు ఉన్న హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీర్ఘకాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో పోలిస్తే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌ డబుల్ డిజిట్ ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది.

మరెన్నో పెట్టుబడి మార్గాలు

  • ప్రతి నెలా రూ.5000 పెట్టుబడి పెట్టాలని భావించే వారికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ రిస్క్ కలిగిన డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లను పరిశీలించవచ్చు. అత్యధిక రిస్క్ కలిగిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. మన పెట్టుబడి సామర్థ్యం, రిస్క్‌ను భరించగలిగే సత్తా ఆధారంగా వీటిలో ఏవి ఎంచుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్‌లను ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు.
  • కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి హైబ్రిడ్ ఫండ్స్ సేఫ్. ఎందుకంటే అవి తమ దగ్గరున్న నిధుల్లో 65 శాతాన్ని ఈక్విటీలలో, 35 శాతాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడతాయి. దీనివల్ల వాటికి నిలకడగా రాబడులు వస్తుంటాయి.
  • ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ ఫండ్స్ తమ నిధులను సురక్షితమైన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటాయి. ఈ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ నిబంధన కింద పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. అయితే ఈ ఫండ్స్ మూడేళ్ల లాకిన్ పీరియడ్‌తో వస్తాయి.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్లు అనేవి లో రిస్క్ పెట్టుబడి సాధనాలు. కెరీర్ తొలిదశలో ఉన్నవాళ్లు వీటిని ఎంచక్కా ఎంచుకోవచ్చు. ఇవి నిలకడగా రాబడులను అందిస్తాయి. ఎఫ్‌డీలపై సగటున 8 శాతం నుంచి 9 శాతం దాకా రాబడులు వస్తాయి. సేవింగ్స్ అకౌంటులో డబ్బులు ఉంచడం కంటే ఎఫ్‌డీ చేయడం బెటర్ అని చెప్పవచ్చు.
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగి ఉంటుంది. 15ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో ఇందులో పెట్టుబడి పెడితే పన్ను ఆదా ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణమైన రాబడులను ఇది ఇవ్వలేదు.
  • కొత్తగా జాబ్​లో చేరినవారు తమ పెట్టుబడి మొత్తంలో 90 నుంచి 100 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఈటీఎఫ్‌లలోకి మళ్లించడం బెటర్. దీర్ఘకాలంలో ఇవి వారికి చక్కటి రాబడులను సంపాదించి పెట్టే అవకాశం ఉంది.

నోట్​ : ఆ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు మీ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడులు పెట్టే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

స్టార్టప్ ప్రారంభించాలా? ఆన్​లైన్​లోనే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోండిలా! - Startup Registration Process

రూ.2 లక్షల బడ్జెట్​లో మంచి స్కూటీ కొనాలా? టాప్-10 మోడల్స్ ఇవే! - Best Scooters Under 2 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.