Man Rapes Goat in Malda : మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అక్కడితో ఆగకుండా అడ్డుకున్న మేక యజమాని, అతడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన బంగాల్లోని మాల్దాలో సోమవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఓ వ్యక్తి తన మేకను మేత కోసం పొలంలో విడిచిపెట్టాడు. గంట తర్వాత మళ్లీ పొలానికి వెళ్లగా మేక అక్కడ కనిపించలేదు. సమీపంలో గాలించగా, మారుమూల పొలంలో మేక అరుపులు వినిపించాయి. వెంటనే అక్కడి వెళ్లి చూడగా ఓ యువకుడు మేకపై అసహజ చర్యకు పాల్పడుతున్నాడు. దీనిని గమనించిన మేక యజమాని అడ్డుకునేందుకు వెళ్లగా, కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు
అనంతరం మేకను ఇంటికి తీసుకొచ్చి, జరిగిన దారుణాన్ని గ్రామస్థులకు చెప్పాడు యజమాని. దీంతో ఆగ్రహించిన నిందితుడు, ఫుల్‌గా మద్యం తాగి వచ్చి మేక యజమాని, ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్థులు కలుగజేసుకుని నిందితుడి నుంచి బాధిత కుటుంబాన్ని కాపాడారు. ఆ తర్వాత మేక యజమాని, అతడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
"నేను మేకను మేత కోసం పచ్చిక బయళ్లలో వదిలి ఇంటికి వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరిగి మేక కన్పించలేదు. అప్పుడు పొలం సమీపంలో ఓ యువకుడు మేకపై అసహజ చర్యకు పాల్పడడం చూశాను. మేక ముఖాన్ని టవల్‌తో కప్పేశాడు. నేను నిందితుడిని పట్టుకునేందుకు పరిగెత్తగానే అక్కడి నుంచి పారిపోయాడు. మేకను తీసుకుని ఇంటికి వచ్చేశాను. తర్వాత మార్కెట్‌కు వెళ్లాను. అక్కడ మేకపై జరిగిన దారుణాన్ని గ్రామస్థులకు చెప్పాను. దీంతో నిందితుడు నాపై, నా భార్య, అన్నయ్య, తల్లిపై దాడికి పాల్పడ్డాడు. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. "
-- మేక యజమాని
దర్యాప్తు షురూ
మేక యజమాని ఫిర్యాదు ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. "నిందితుడి దాడిలో నలుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు హరిశ్చంద్రపుర్ గ్రామీణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంచల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఒకరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ఐపీసీ సెక్షన్ 377 కింద శిక్షార్హమైనవి. నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశాం." అని పోలీసులు తెలిపారు.