Special Water Less Cooler : దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న మెషిన్ టూల్స్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఎక్స్‌పోలో నీరు అవసరం లేని ఎయిర్ కూలర్, విద్యుత్‌ను ఆదా చేసే యంత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో సందర్శకులంతా ఆ రెండు యంత్రాల కోసం తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
నీరు లేకుండానే చల్లని గాలి
భారత్ మండపంలో హాల్ నెంబర్ 4,5,6లో ఎక్స్పో జరుగుతుండగా, 4వ నెంబర్ రూమ్‌లో నీరు లేకుండా నడిచే కూలర్ ప్రజలను ఆకర్షిస్తోంది. నీరు అవసరం లేకుండానే చల్లని గాలి ఇస్తుంది. కేవలం తేమతోనే కూలర్ పనిచేస్తుందని తయారీదారుడు తెలిపారు. కూలర్ ధర రూ.6000గా చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్స్‌పోలో రూ.500 డిస్కౌంట్‌తో రూ.5500కు అమ్ముతున్నట్లు వెల్లడించారు.

40 శాతం ఆదా
మరోవైపు, అదే రూమ్‌లో విద్యుత్ ఆదా యంత్రం కూడా ఆకర్షణీయంగా మారింది. ఆ యంత్రాన్ని ఇంట్లో ఏ ఎలక్ట్రికల్ బోర్డుపైనైనా అమర్చడం ద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని తయారీ కంపెనీ ఉద్యోగి అజయ్ తెలిపారు. ఇంట్లో విద్యుత్ వినియోగం ఎంతైనా సరే, యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా 40 శాతం వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
ఒకటి కొంటే ఒకటి ఉచితం
ఆ మెషీన్ ధర రూ.2000 అని, ఇప్పుడు ఎక్స్‌పోలో రూ.1500కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఒకటి కంటే ఒకటి ఉచితం ఆఫర్ కూడా ఉందని చెప్పారు. కర్మాగారాల్లో వాణిజ్య విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి, ఒక పెద్ద యంత్రాన్ని కూడా తయారు చేశామని పేర్కొన్నారు. దాని ధర రూ. 5000 నుంచి రూ. 10000 వరకు ఉంటుందని ఉద్యోగి అజయ్ వెల్లడించారు.

అయితే విద్యుత్ ఆదా యంత్రం ద్వారా ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని మరో ఉద్యోగి ఆర్డీ చౌదరి తెలిపారు. అది జరగకపోతే తమ కార్యాలయాలనికి వచ్చిన ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. విద్యుత్ వైరింగ్‌లో నష్టాన్ని తగ్గిస్తుందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారిస్తుందని, తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందని పేర్కొన్నారు. అలా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుందని వెల్లడించారు.
భారత్ మండపంలో ఇండియన్ మెషిన్ టూల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఎక్స్పోను ఏర్పాటు చేసింది. మే9వ తేదీన మొదలైన ఎక్స్పో, మే 12వ తేదీ వరకు జరగనుంది. సుమారు 230 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అందులో 20% విదేశీ కంపెనీలు, 80% భారతీయ కంపెనీలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీతోపాటు సరికొత్త యంత్రాల గురించి ప్రజలకు తెలియజేయడమే ఎక్స్పో లక్ష్యంగా అధికారులు వెల్లడించారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో - సూపర్ కార్స్ & బైక్స్ చూశారా?
500 కి.మీ రేంజ్- అదిరే ఫీచర్లతో మారుతి సుజుకి ఈ-విటారా ఆవిష్కరణ - ధర ఎంతంటే?