ETV Bharat / bharat

3 కార్లు, రూ.36 లక్షలు బ్యాంకు డిపాజిట్లు- వినేశ్‌ ఫొగాట్‌ ఆస్తుల వివరాలివే! - Vinesh Phogat Properties List

Vinesh Phogat Properties List : స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా కాంగ్రెస్​ తరఫున జులానా నియోజకవర్గం నుంచి పోటీపడేందుకు నామినేషన్​ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఓ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం.

author img

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 11:49 AM IST

Vinesh Phogat Properties List
Vinesh Phogat (ANI)

Vinesh Phogat Properties List : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా జులానా నియోజకవర్గం నుంచి నామినేషన్​ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.

ఇంతకీ ఆ అఫిడవిట్​లో ఏముందంటే?
వినేశ్​ దగ్గర రూ.4కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ఆమె తన అఫిడవిట్‌లో వెల్లడించారు. సోనిపత్‌లో రూ.2కోట్లు విలువ చేసే స్థిరాస్తి ఉందన్నారు. ఇక ఆమె వద్ద అందులో మూడు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.35 లక్షల విలువ చేసే వోల్వో ఎక్స్‌సీ 60, రూ.12 లక్షల విలువ చేసే హ్యుందాయ్‌ క్రెటా, రూ.17లక్షల గల టొయోటా ఇన్నోవా కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్నోవా కోసం రూ.13 లక్షల అప్పు తీసుకున్నానని, ప్రస్తుతం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. తన భర్త సోమ్‌వీర్‌ రాఠీ పేరిట రూ.19లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో కారు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రూ.39లక్షల బ్యాంకు డిపాజిట్లు
ఇదిలా ఉండగా, ఆమె చేతిలో రూ.1.95లక్షల నగదు ఉన్నట్లు వినేశ్‌ తెలిపారు. మూడు బ్యాంకుల్లో దాదాపు రూ.39లక్షలు డిపాజిట్లు ఉండగా, ఆమె భర్తకు మరో రూ.30లక్షలకు మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని అన్నారు. 35 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. దీని విలువ రూ.2.74లక్షల మేర ఉంటుంది. ఇక భర్తకు 28 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు. మద్రాసులో వినేశ్​ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్లు తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

ఇక గతవారమే కాంగ్రెస్​లో చేరిన వినేశ్‌కు వెనువెంటనే పార్టీ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చింది. అది కూడా ఆమె సొంత నియోజకవర్గమైన జులాన్‌ నుంచే. జట్లు (JATT) అధికంగా ఉండే ఈ స్థానం నుంచి వినేశ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు బీజేపీ తరఫున యోగేశ్‌ బైరాగి నిలబడనున్నారు. మరోవైపు, ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా తన అభ్యర్థిగా డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మహిళా రెజ్లర్‌ కవితా దలాల్‌ను నిలబెట్టింది.

ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్​- జులానా నుంచి పోటీ- 31మందితో కాంగ్రెస్​ ఫస్ట్​ లిస్ట్​ - Vinesh Phogat Haryana Elections

కాంగ్రెస్​లోకి వినేశ్, భజరంగ్- హరియాణా ఎన్నికల్లో పోటీపై వారిదే నిర్ణయం! - Vinesh Phogat Bajrang Punia

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.