Vinayaka Chavithi Celebrations : దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముంబయి లాల్‌బాగ్‌లోని లాల్‌బగీచా ఆలయం సందడిగా మారింది. ఉదయం నుంచే ప్రముఖులతోపాటు ప్రజల రాక మొదలైంది. లాల్‌బాగ్ వినాయకుడికి అనంత్ అంబానీ 20-కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని లాల్‌బాగ్ ఆలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, శివసేన-యూబీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీసమేతంగా వచ్చి ఏకదంతుడిని దర్శించుకున్నారు. హారతి సమర్పించి, ఆశీస్సులు పొందారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు లాల్‌బాగ్ గణనాథుడిని దర్శించుకున్నారు.
#WATCH | The Ambani family offers prayers to Lord Ganesh on #GaneshChaturthi2024, at their residence in Mumbai. pic.twitter.com/A9Q8o98pKo
— ANI (@ANI) September 7, 2024
ఏక్‌నాథ్ శిందే : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తన నివాసంలో ఏకదంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. వివిధ రకాల నైవేద్యాలు, కర్పూర హారతి సమర్పించారు. ఈ వేడుకల్లో సీఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రమోద్ సావంత్ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన నివాసంలో గణపతిమూర్తిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సీఎం సతీమణితోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజ్‌ఠాక్రే : ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రే నివాసంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. కనకం, రజతం రంగుల్లో బుజ్జి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
సోనూసూద్ : ప్రముఖ నటుడు సోనుసూద్ నివాసంలోనూ గణేశ్ నవరాత్రి వేడుకలు జరిగాయి. ముంబయిలోని తన నివాసంలో ఆయన అందంగా ముస్తాబు చేసిన మండపంలో శ్వేతవర్ణంలో ఉన్న లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించిన సోనుసూద్ ఆ తర్వాత ఈ వేడుకలో పాల్గొనవారికి మిఠాయిలు పంచారు.
400కోట్లతో బీమా : పుణెలోని గణపతి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి వేడుకలను పురస్కరించుకొనిగణపయ్యను పుత్తడితో అలంకరించారు. మహాహారతి నిర్వహించటంతోపాటు భజనలు చేశారు. ముంబయిలోని ప్రముఖ GSB సేవా మండల్ మహాగణపయ్య ఈసారీవార్తల్లో నిలిచారు. దేశంలోనే సంపన్నమూర్తిగా పేరొందిన వినాయకుడికి ఈ ఏడాది 400కోట్లతో బీమా చేయించారు. ఈ గణపయ్య విగ్రహాన్ని 66కిలోల బంగారు, 325 కిలోల వెండి నగలతో అలంకరించారు.
తేజస్ నమూనా : ముంబయిలోని శాంతాక్రాజ్ ప్రాంతంలో ఓ కుటుంబం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. యుద్ధ విమానం తేజస్ నమూనాపై గణనాథుడిని ఏర్పాటు చేశారు. గరుడపక్షిపై ఆసీనుడై అభయప్రదానం చేస్తున్నాడు.
VIDEO | Maharashtra: A family in the Santacruz area of Mumbai has installed a model of fighter jet Tejas as part of decoration for Ganesh Chaturthi celebrations. #GaneshChaturthi2024
— Press Trust of India (@PTI_News) September 7, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/Y2eVHG8Eg2
ప్రకృతి విలయం థీమ్ : చెన్నైకి చెందిన కొందరు యువకులు వయనాడ్‌ను కకావికలం చేసిన ప్రకృతి విలయం థీమ్‌తో వినాయక మండపం ఏర్పాటు చేశారు. కొండలపై నుంచి భారీ ప్రవాహం ధాటికి ఊళ్లకుఊళ్లే కొట్టుకుపోయాయి. పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయారు. ఆ విపత్తును చాటేలా వినాయక మండపాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Tamil Nadu | Kerala's Wayanad-themed Lord Ganesha idol at Keelkattalai area of Chennai on the occasion of #GaneshChaturthi pic.twitter.com/t3idhXcYlE
— ANI (@ANI) September 7, 2024
ఆదివారం మహిళలంతా అలా చేయాల్సిందే! అప్పుడే దోషాలన్నీ పరార్!! - Rishi Panchami 2024