Tajmahal Fake Video : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల వ్యాప్తి ఎక్కువైంది. అదే సమయంలో ఆగ్రాలోని తాజ్‌మహల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి జరిపిందని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. అంతే కాదు ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్‌తో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అది ఫేక్ అని తేల్చారు.
అసలేం జరిగిందంటే?
ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఒక్కసారి తాజ్‌మహల్‌పై పాకిస్థాన్ దాడి జరిగిందని తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఏఐతో చేసిన ఫేక్ వీడియో ఫుల్‌గా వైరలైంది. దీంతో ఆగ్రా పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్ వైరల్ వీడియోపై చర్యలు తీసుకుంది. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినట్లు తేల్చింది. వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించిన సైబర్ క్రైమ్ పోలీసులు, కేసు నమోదు చేశారు.
कतिपय सोशल मीडिया प्लेटफॉर्म्स पर इस वीडियो को " पाकिस्तान ने ताजमहल पर करा हमला" लिखकर पोस्ट किया जा रहा है।
— POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) May 11, 2025
➡️आगरा में ऐसी कोई घटना नहीं हुई है।
➡️यह वीडियो एआई जनरेटेड="" फेक है।
➡️ऐसे पोस्ट करने वालों के विरुद्ध fir दर्ज की जा रही है।
⚠️कृपया इस वीडियो को post="" share न करें। pic.twitter.com/UdHObqnEbD
సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్‌లు, వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి ఆదివారం రాత్రి కొందరు ప్రయత్నించినట్లు డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైరల్, ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మవద్దని కోరారు. తప్పుదారి పట్టించే వీడియోలు షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజ్‌మహల్ వద్ద పర్యాటకులపైకి దూసుకొచ్చిన డ్రైవర్ లేని కారు
తాజ్ మహల్లో వాటర్ లీకేజీ- ప్రధాన గోపురం, పైకప్పుకు రిపేర్లు!