వాలెంటైన్స్​ డే స్పెషల్​ - మీ ప్రియమైన వారికి ఇలా విషెస్​ చెప్తే ఫిదా అయిపోతారంతే!

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 1:03 PM IST

Updated : Feb 14, 2024, 9:08 AM IST

Valentines Day 2024 Wishes and Quotes

Valentines Day 2024 Wishes and Quotes: ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి, వెలకట్టలేని సంపద. ఈ జగత్తునే ముందుకు నడిపించగల కనిపించని భావోద్వేగం ప్రేమ. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు నాడు.. ఒక్కమాటలో కాకుండా ఇలా విషెస్​ చెప్పారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకోసం ఈటీవీ భారత్​ స్పెషల్​ విషెస్​ అండ్​ కోట్స్​ అందిస్తోంది.

Valentines Day 2024 Wishes and Quotes: ప్రేమ - రెండు అక్షరాల పదం, రెండు జీవితాల బంధం. మాటలు నేర్చిన దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు ఎవ్వరిని అడిగినా దీని గురించి గుక్కతిప్పుకోకుండా చెబుతారు. పలకడానికి రెండే అక్షరాలైనా దీని పరిధి అనంతం! జగతిని నడిపే ప్రేమకు వయసే లేదు. ప్రేమకు ఘనమైన చరిత్ర ఉంది. మధురమైన వర్తమానం ఉంది. ఊహించని భవిష్యత్తు ఉంది. ప్రేమ ఏదీ అంటే చూపించలేము, ఎంత అంటే చెప్పలేము. దాయలేనంత విశాలమైనది.. వెలకట్టలేనంత విలువైనది. యుగాలు మారినా, తరతరాలు పుట్టుకొచ్చినా ఎప్పటికీ నిలిచి ఉండేది, మనిషిని నిలిపేది ప్రేమ. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన ప్రేమికుల రోజు రానే వచ్చింది. మరి ఈరోజు హ్యాపీ వాలెంటైన్స్​​ డే అని ఒక్కమాటలో కాకుండా ఇలా చెప్పారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అందుకోసం ఈటీవీ భారత్​ స్పెషల్​ విషెస్​ అండ్​ కోట్స్​ అందిస్తోంది. మరి లేట్​ చేయకుండా దీనిపై ఓ లుక్కేయండి.

Valentines Day 2024 Wishes Telugu

 • నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన నువ్వే. నిద్ర లేచాక నా మొదటి ఆలోచన నువ్వే - ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
 • పరిస్థితుల్ని బట్టి మారేది ప్రేమ కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకునేది ప్రేమ - హ్యాపీ వాలెంటైన్స్​​ డే
 • నీ మౌనం ఒక అనురాగం, నీ ప్రేమ ఒక అనుబంధం, నీ ప్రేమ కోసం అనుక్షణం నిరీక్షిస్తూ - ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
 • నువ్వే నేనైతే నీ ప్రేమ నాదే, నా తొలివలపు నీవైతే నీ ప్రాయం నాదే - ప్రేమికుల రోజు శుభాకాంక్షలు డియర్​
 • జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు అవసరం లేదు. నువ్వు చాలు - హ్యాపీ వాలెంటైన్స్​​ డే
 • ప్రపంచంలో అత్యంత అందమైనది, ఊహలకు అందనిది ప్రేమ -ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
 • ప్రేమను చెప్పడానికి నిమిషం చాలు, కానీ ఆ ప్రేమను చూపడానికి జీవితం సరిపోదు - ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
 • ప్రేమ మీద నమ్మకం లేని నాకు, అసలైన ప్రేమంటే ఇది అని రుచి చూపించావు. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.. ఎందుకైందంటే.?

Valentines Day 2024 Quotes Telugu

 • "వేకువలో నను తాకే తొలి కిరణం నీవే

సంధ్యవేళలో నాపై వీచే చిరుగాలి నీవే

వానలో నామీద కురిసే తేనె జల్లు నీవే

వెన్నెల్లో నాకు హాయి కలిగించే వెచ్చదనం నీవే" - ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

 • "ఎవరికైనా జీవితకాలం అంటే జనన మరణ మధ్య కాలం

నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవిత కాలం" - హ్యాపీ వాలెంటైన్స్​ డే

 • "నన్ను నీ కళ్లలో పెట్టుకోకు- కన్నీళ్లలో కొట్టుకుపోతాను

హృదయంలో దాచుకో- ప్రతి స్పందనకు గుర్తుంటాను"- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

 • "ఉదయించే సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తే

నీరాక నా జీవితంలో వెలుగు నింపింది" - ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

 • "మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు

మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ" - వాలెంటైన్స్​ డే శుభాకాంక్షలు

 • "మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం

వదిలేయడానికి నువ్వు వస్తువు కాదు నా ప్రాణం

పక్కన పెట్టడానికి నువ్వు పరాయి దానివి కాదు నా ఆత్మవి.

నువ్వు గుర్తు రాకుండా ఉండటానికి బొమ్మవి కాదు నా ప్రేమవి‘‘- హ్యాపీ వాలెంటైన్స్​ డే

 • "ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే

దానికి అంతం మరణం మాత్రమే

మనిషికి చావు తప్ప ప్రేమకు చావు లేదు‘‘ - ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

ప్రేమికుల రోజున మీ లవర్​కు ఈ గిఫ్ట్‌ ఇవ్వండి - ఖర్చు తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ!

'వాలెంటైన్స్​ డే'... ఫ్రమ్ హోమ్!

ప్రేమికుల రోజే కాదు... పెళ్లి రోజూ ఇవాళే!

హాయ్..! నా ప్రేమను గెలుచుకోడానికి నన్నే త్యాగం చేశాను..

Last Updated :Feb 14, 2024, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.