ETV Bharat / bharat

ఇన్​స్టాగ్రామ్​లో ప్రేమ- దివ్యాంగుడు కోసం భారత్​కు వచ్చిన నేపాలీ అమ్మాయి - NEPALI GIRL UNIQUE LOVE STORY

ఐదు నెలల క్రితం ఇన్​స్టాగ్రామ్​లో స్నేహం- కట్​ చేస్తే అబ్బాయి కోసం భారత్​కు వచ్చిన నేపాలీ అమ్మాయి

Nepali Girl Married To Handicapped
Nepali Girl Married To Handicapped (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 25, 2025 at 9:44 AM IST

2 Min Read

Nepali Girl Married To Handicapped : ప్రేమకు కులం, మతం ప్రాంతం అలాంటి సరిహద్దులు ఏమి ఉండవని అంటారు. వాళ్ల ప్రేమను దక్కించుకునేందుకు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. అలాంటిదే ఈ నేపాలీ యువతి ప్రేమ కథ కూడా. తను ప్రేమించిన అబ్బాయి కోసం ఇండియాకు వచ్చింది. అందులో స్పెషల్​ ఏముంది అని అంటారా? ఆ అబ్బాయి కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడు. ఐదేళ్ల నెలల క్రితం ఇన్​స్టాగ్రామ్​లో పరిచమైన వ్యక్తి కోసం దేశం దాటి వచ్చి మరి పెళ్లి చేసుకుంది.

ఇన్​స్టాలో పరిచయం
ఝార్ఖండ్​లోని ఝార్ఖండ్​లోని పలామా జిల్లా సత్బర్వా ప్రాంతంలోని తాబర్​ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్(20) చేతులు, కాళ్లు లేని దివ్యాంగుడు. ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేస్తుంటాడు. యూట్యూబ్​ ఛానల్​ కూడా ఉంది. ప్రస్తుతం అతడు పలామా జీఎల్​ఏ కాలేజ్​లో ఉర్దూలో గ్రాడ్యుయేషన్​ చేస్తున్నాడు. నేపాల్​కు చెందిన భూమికా విశ్మకర్మ నెయిల్​ ఆర్టిస్ట్​గా పని చేస్తుంది. నెలకు రూ.20-25 వేల వరకు వస్తాయి. అయితే ఐదు నెలల క్రితం ఇన్​స్టాగ్రామ్​లో ఆరిఫ్​తో భూమికాకు పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆరిఫ్​ కోసం భూమికా నేపాల్ నుంచి ఇండియాకు వచ్చేసింది. ఆరిఫ్​ కుటుంబ సభ్యులను కలిసి అతడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆమెకు నచ్చజేప్పాలని కుటుంబ సభ్యలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుకు అంగీకరించలేదు. చివరికి ఆరిఫ్​- భూమికాకు పెళ్లి చేశారు. వివాహం తర్వాత భూమికా తన పేరును అఫ్సానాగా మార్చుకుంది.

'వీడియోలు చేసుకుంటూ బతుకుతాం'
ఇన్​స్టాగ్రామ్​లో ప్రేమించుకున్నామని, ఆ తర్వాత భూమికా తన కోసం ఇంటికి వచ్చేసిందని ఇప్పుడు వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నామని ఆరిఫ్​ చెబుతున్నాడు. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని, అందుకు కుటంబం, సమాజం నుంచి మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నాడు. దివ్యాంగుడని తెలిసినప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భూమికా తెలిపింది. ఇక నుంచి ఇద్దరం కలిసి వీడియోలు చేస్తామని, దీని ద్వారా ఆదాయం రాకపోతే ఉద్యోగం చేస్తానని చెప్పింది. ఆరిఫ్​ను మాత్రం వదిలిపెట్టను అని భూమికా అంటోంది.

Nepali Girl Married To Handicapped
ఆరిఫ్​తో నేపాలీ అమ్మాయి భూమికా (ETV Bharat)

భూమికా పెళ్లి చేయమని ఇంటికి వచ్చి అడిగినప్పుడు నిరాకరించినట్లు ఆరిఫ్​ తల్లి చెప్పింది. 'ఆరిఫ్ దివ్యాంగుడు. అతడితో జీవితాన్ని గడపలేవు అని చెప్పాము. కానీ ఆ అమ్మాయి గట్టి నిర్ణయం తీసుకుంది. ఆరిఫ్​తోనే ఉంటానని పట్టుబట్టింది. మాకు ఎప్పుడూ ఆరిఫ్‌ను ఎవరు చూసుకుంటారు అనే ఆందోళన ఉండేది. ఈ పెళ్లి తర్వాత ఆ భయం కొంతవరకు తగ్గిపోయింది' అని ఆరిఫ్ తల్లి చెబుతుంది.

ఒకే కుటుంబంలో ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లి- ఊరంతా ఆ ఇంట్లోనే!

జమ్ముకశ్మీర్​లో వర్ష బీభత్సం- కాలినడకన పెళ్లి మండపానికి వెళ్లిన వరుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.