ETV Bharat / bharat

TVK ఆర్మీపై దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు- ఇండియాలోనే అతిపెద్దదట! - TVK SOCIAL MEDIA

సోషల్‌ మీడియాలో గౌరవం కాపాడుకోండి, బాధ్యతగా ఉండండి- టీవీకే ఐటీ విభాగానికి దళపతి విజయ్ విజ్ఞప్తి

TVK Social Media
TVK Social Media (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 19, 2025 at 7:33 PM IST

2 Min Read

Vijay On TVK Social Media : దేశంలోనే మనది అతి పెద్ద సోషల్‌ మీడియా ఆర్మీ అని అంటున్నారు తమిళగ వెట్రీ కజగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్‌. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి విజయ్ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. శనివారం జరిగిన పార్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డివిజన్ ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్‌కు హాజరు కాలేకపోయినా, వీడియో ద్వారా సందేశం పంపారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. విజయ్‌ ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ 2024 ఫిబ్రవరి 2న స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రీ కజగం (TVK) ఇటీవల మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకొంది. 2026 తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ ఐటీ వింగ్ సమావేశం శనివరాం చెన్నైలోని సోలింగనల్లూర్‌లో ఐటీ వింగ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యదర్శి ఆదవ్ అర్జున, పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్.ఆనంద్ నేతృత్వంలో జరిగింది.

ఐటీ విభాగానికి విజయ్ సందేశం
విజయ్‌ తన టీమ్‌ను వర్చువల్ వారియర్స్‌ అని పిలిచారు. ఇండియాలోనే పార్టీకి అతి పెద్ద సోషల్‌ మీడియా ఆర్మీ ఉందని ప్రశంసించారు. టీవీకే ఆన్‌లైన్‌లో సంపాదిస్తున్న పాపులారిటీ గురించి చాలా మంది మాట్లాడారని, అలానే నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. "దయచేసి ఆన్‌లైన్‌లో గౌరవాన్ని కాపాడుకోండి. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను షేర్‌ చసేటప్పడు గౌరవంగా, బాధ్యతాయుతంగా ఉండండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కష్టపడి పనిచేయండి. నేను త్వరలో మీ అందరినీ కలుస్తాను. అందరికీ శుభాకాంక్షలు. విజయం ఖాయం. ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. త్వరలోనే వర్చువల్‌ వారియర్స్‌ అందరినీ స్వయంగా కలవాలని ఆశిస్తున్నానని చెబుతూ వీడియోను ముగించారు.

విజయ్ ప్రస్తుతం హెచ్.వినోత్ దర్శకత్వంలో జన నాయగన్ సినిమా చేస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మొదట 2025 అక్టోబర్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవలే నిర్మాణ సంస్థ కొత్త పోస్టర్‌తో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది. కలర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్‌ డ్యాన్స్‌ చేస్తున్న పోస్టర్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ మూవీతో సినిమాలకు ముగింపు పలికి, శాశ్వతంగా రాజకీయాలపై దృష్టి పెడతారని టాక్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.