Honeymoon Couple Missing Case : మేఘాలయలో హనీమూన్ జంట మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతని భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించందని పోలీసులు తెలిపారు.
'నిందితురాలు సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసుల ముందు లొంగిపోయింది. రఘువంశీని హత్య చేసిన ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశాం. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు- సోనమ్ స్వయంగా తన భర్తను హత్య చేయడానికి తమను నియమించుకుందని తెలిపారు' అని మేఘాలయ డీజీపి ఐ నోంగ్రాంగ్ సోమవారం వెల్లడించారు.
పోలీసులను అభినందించిన సీఎం
ఈ కేసును ఛేదించిన పోలీసులను ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా అభినందించారు.
Within 7 days a major breakthrough has been achieved by the #meghalayapolice in the Raja murder case … 3 assailants who are from Madhya Pradesh have been arrested, female has surrendered and operation still on to catch 1 more assailant .. well done #meghalayapolice
— Conrad K Sangma (@SangmaConrad) June 9, 2025
"దేశాన్ని, రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసును మేఘాలయ పోలీసులు కేవలం 7 రోజుల్లోనే ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి కారణమైన మహిళ పోలీసులకు లొంగిపోయింది. మరో నిందితుడిని పట్టుకోవడానికి ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి." - కాన్రాడ్ కె సంగ్మా, మేఘాలయ సీఎం
ఏం జరిగింది అంటే?
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్‌తో ఇటీవల మే11వ తేదీన వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత మే 20న హనీమూన్ కోసం షీల్లాంగ్కు వెళ్లారు. అక్కడ గడుపుతున్న వారు, కుటుంబసభ్యులతో మే 25వ తేదీవరకు కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ రావడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. చివరకు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అదృశ్యం అయిన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆయన భార్య సోనమ్ ఆచూకీ దొరకలేదు. దీనితో సోనమ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె కుటుంబసభ్యులు అనుమానించారు. ఎంతకీ ఈ కేసు మిస్టరీ వీడకపోవడంతో కేసును సీబీఐకు అప్పగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా ఈ మర్డర్ మిస్టరీ వీడింది. భార్యే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పాకిస్థాన్ పరువు పాయే- ఫేక్ ప్రచారాలను బట్టబయలు చేసిన శాటిలైట్ ఇమేజెస్!
రోల్ మోడల్ రష్మిరేఖ- లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు- VVIP వస్తే ఆమె ఉండాల్సిందే!