Tirumala Tirupati Devasthanam Tickets : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. చాలా మంది కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు, ముడుపులను చెల్లించుకుంటారు. ఆ స్వామి వారికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తుల సౌకర్యార్థం.. టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు. అక్కడ వసతులు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దీని స్థానంలో డీఎఫ్‌వో కార్యాలయంలో శాశ్వాత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఈవో ఆదేశించారు.
ఇటీవల కొండపైన భక్తుల రద్దీని తగ్గించేందుకు టీటీడీ కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే టికెట్‌లను అందుబాటులో ఉంచగా.. ఆఫ్‌లైన్‌లో మాత్రం శ్రీవాణి టికెట్ల జారీ సంఖ్యను వెయ్యికి(1000) తగ్గించింది. 1000 శ్రీవాణి టికెట్‌లలో 900 టికెట్లను.. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మొదట వచ్చిన వారికి ఇవ్వనున్నారు. ఇక మిగిలిన వంద టికెట్లను శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్‌పోర్టులోని కరెంట్ బుకింగ్ కౌంటర్‌లలో అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఇక్కడ ఒక విషయాన్ని భక్తులు గమనించాలి. బోర్డింగ్ పాస్ ఉన్న వారికి మాత్రమే తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో ఈ ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తిరుమల స్వామివారి భక్తులు గుర్తించాలని అధికారాలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
టీటీడీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా - గుత్తేదారు సంస్థపై చర్యలు
శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ - ఆ టికెట్లను తగ్గించిన టీటీడీ - అప్పటి నుంచే అమలు!