ETV Bharat / bharat

తండ్రి డెడ్​బాడీతో స్టూడెంట్స్​కు పాఠం - శరీర దానంపై ఈ 'వరల్డ్​ రికార్డ్​' నిత్య స్ఫూర్తి!

తండ్రి మృతదేహంతో స్టూడెంట్స్​కు పాఠం చెప్పిన వైద్యుడు- వేలాది మందికి స్ఫూర్తి నింపిన ఘటన- అవయవ, శరీరాన్ని దానం చేసేందుకు ముందుకొస్తున్న దాతలు

Son Dissect Father Deadbody
Son Dissect Father Deadbody (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 5:18 PM IST

Son Dissect Father Deadbody : ప్రముఖులను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లు చెప్పిన, చేసిన మంచి పనులను ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే, పద్నాలుగేళ్ల క్రితం కర్ణాటకలోని బెళగావికి చెందిన ఓ వైద్యుడు చేసిన పనికి ఇప్పటికీ వేల మందిలో స్ఫూర్తి నింపుతోంది. ఆయన ద్వారా ప్రేరణ పొందిన వేలాది మంది అవయవదానం, శరీరాన్ని దానం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అసలు ఎవరీ డాక్టర్​? ఆయన చేసిన పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ రికార్డు
2010లో మహంతేశ్ రామన్నవర తన తండ్రి శరీరాన్ని డైసెక్ట్(శరీరాన్ని కోయడం- సాధారణంగా మెడికల్​ కాలేజీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి మృతదేహాలను కోసి, శరీర భాగాల గురించి వివరిస్తారు)​ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ డెడ్​బాడీతో విద్యార్థులకు పాఠం చెప్పారు. దీంతో తండ్రి శరీరాన్ని ఇలాంటి పనికి ఉపయోగించిన మొట్టమొదటి వైద్యుడిగా రామన్నవర ప్రపంచ రికార్డుకెక్కారు. ఈ క్రమంలో రామన్నవరను స్ఫూర్తిగా తీసుకుని స్వామీజీలతో సహా వేలాది మంది తమ శరీరాలను దానం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.

విలియం హార్వే స్ఫూర్తితో!
17వ శతాబ్దం చివర్లో ఇంగ్లాండ్​కు చెందిన సర్ విలియం హార్వే మానవ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో చనిపోయిన తన సోదరి మృతదేహాన్ని ల్యాబ్​లో డైసెక్ట్​ చేసి పరీక్షించారు. అప్పుడు శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని కనుక్కొన్నారు. నేటి వైద్యులకు ఆయన మార్గదర్శకులయ్యారు. అయితే 300 ఏళ్ల తర్వాత డాక్టర్ మహంతేశ్ రామన్నవర మరణించిన తన తండ్రి మృతదేహాన్ని విద్యార్థులకు పాఠం చెప్పేందుకు ఊపయోగించి వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

అసలేం జరిగిందంటే?
బైలహోంగళకు చెందిన ప్రముఖ వైద్యుడు బసవన్నెప్ప సంగప్ప రామన్నవర. ఆయన 2008 నవంబరు 13న తుదిశ్వాశ విడిచారు. బసవన్నెప్ప తన మృతదేహాన్ని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి దానం చేస్తానని బతికుండగానే తెలిపారు. అయితే ఆ తర్వాత తన కుమారుడు మహంతేశ్ పనిచేస్తున్న కేఎల్ఈ బీఎం కంకణవాడి ఆయుర్వేద మహా విద్యాలయానికి దానం చేస్తానని ఓ లేఖలో పేర్కొన్నారు. దీంతో తన తండ్రి మృతదేహాన్ని డాక్టర్ మహంతేశ్ రామన్నవర స్వయంగా యూనివర్సిటీకి అప్పగించారు.

"నా తండ్రి తాను చనిపోయాక తన డెడ్ బాడీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తన మృతదేహాన్ని వైద్య విద్యార్థులు పరీక్షల కోసం ఉపయోగించాలని మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. 2008 నుంచి మా నాన్న మృతదేహాన్ని రెండేళ్లపాటు బీఎం కంకణవాడి ఆయుర్వేద మహావిద్యాలయంలో ఉంచాం. 2010 నవంబర్ 13న మృతదేహాన్ని విద్యార్థుల ఎదుట డైసెక్ట్​ చేశాం. ఈ నిర్ణయం వైద్య విద్యార్థులకు, శరీరాలను దానం ఇచ్చే వారికి ప్రేరణగా నిలిచింది" అని డాక్టర్ మహంతేశ్ రామన్నవర "ఈటీవీ భారత్‌"కు తెలిపారు.

దానానికి ముందుకొచ్చిన వేలాది మంది!
అయితే తన తండ్రి మృతదేహాన్ని వైద్య విద్యార్థులకు పాఠం చెప్పడం కోసం ఉపయోగించిన తర్వాత డాక్టర్ మహంతేశ్ ఊరుకోలేదు. ఇలా శరీరాన్ని దానం చేయడానికి ఉన్న ప్రాధాన్యంపై నగరమంతా తిరిగి అవగాహన కల్పించారు. ఆయన స్ఫూర్తితో వేలాది మంది మరణానంతరం తమ శరీరాన్ని దానం చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ఇలా డొనేట్​ చేయడానికి స్వామీజీలు ముందుకొచ్చారు. అలాగే తమ భక్తులకు కూడా దేహదానంపై అవగాహన కల్పిస్తున్నారు.

స్ఫూర్తి పొందిన స్వామీజీలు
2017లో కరంజి మఠానికి చెందిన గురుసిద్ధ స్వామీజీ, అక్కడ ఉన్న మరో 200మంది భక్తులు దేహదానానికి ముందుకొచ్చారు. అలాగే మునవల్లి సోమశేఖర మఠానికి చెందిన మురుఘేంద్ర స్వామీజీ 2010లో నేత్రదానం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన స్ఫూర్తితో 375 మందికి పైగా మరణానంతరం నేత్రదానం, దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వీరిలో ఇప్పటివరకు మృతి చెందిన 8మంది మృతదేహాలను రామన్నవర చారిటబుల్ ట్రస్టుకు అందజేశారు. నాగనూరులోని గురుబసవ పీఠానికి చెందిన బసవప్రకాశ్ స్వామీజీ నేత్రదానం, దేహదానం చేస్తామని ప్రమాణం చేశారు.

మృతదేహాల కొరత
దేశంలో మెడికల్‌, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, డెంటల్‌ కళాశాలలతో పాటు వైద్య విద్యనభ్యసించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. కాలేజీల్లో పరీక్షల కోసం మృతదేహాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ మహంతేశ్ తీసుకున్న నిర్ణయంతో మెడికల్ కాలేజీలకు డెడ్ బాడీలను ఇచ్చేందుకు చాలా ముంది ముందుకొస్తున్నారు.

శరీరం దానం చేయడాన్ని పురస్కరించుకుని ఏడాదిలో ఒక రోజును ప్రపంచ శరీర దాన దినంగా ప్రకటించాలని​ కేఎల్‌ఈ శ్రీ బీఎం కంకణవాడి ఆయుర్వేద మహావిద్యాలయ అధినేత డా.మహాంతేశ్ రామన్నవర కోరారు. ఇదే విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న గులాంనబీ ఆజాద్​ను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.