Snake Swallowed Sharp Knife In Karnataka: ఎలుకలని, గుడ్లని, ఆఖరికి పాలని తాగిన పాములను చూసి ఉంటాం. అలానే ప్లాస్టిక్ వాటిలో ఇరుక్కోని ఇబ్బంది పడే సర్పాలను చూసి ఉంటాం. కాని ఒక నాగుపాము చేసిన పనిని చూస్తే వామ్మో అనాల్సిందే! కత్తిని మింగేసి కదలకుండా పడుకుంది. సామాన్యంగా పాములు చేసే పనులకంటే ఈ పాము చాలా డిఫరెంట్‌గా చేసింది. ఇది ఇలా జరగడం చాలా అరదు. దీని కారణంగా ఈ వార్త వైరల్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన కర్ణాటకాలో చోటుచేసుకుంది.
పదునైన వస్తువు మింగేసిన పాము: కుంటా తాలూకాలోని హెగ్డేకి చెందిన గోవింద నాయక్ ఇంట్లో వాడే కత్తిని గోడ పై ఉంచారు. అనుకోకుండా ఆ కత్తి గోడ అవతలికి పడిపోయింది. అయితే ఆ పక్కనే నాగుపాము తిరుగుతూ ఉండడం చూసిన ఆ కుటుంబం, పాము వెళ్లిన తర్వాత కత్తి తీసుకుందాం అని కొంత సమయం వరకు ఎదురు చూశారు. ఆహారం ఏదో తిని విశ్రాంతి తీసుకుంటుందన్న నేపథ్యంలో పాముని ఏమి చేయకుండా అది వెళ్లే దాకా వేచి చూశార. ఎంత సేపటికి అక్కడ నుంచి కదలకపోవడంతో కుటుంబ సభ్యులకు పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. బహుశా పాము కత్తిని మింగేసి ఉండవచ్చని భావించారు. వెంటనే స్నేక్ క్యాచర్ పవన్ నాయక్‌కు సమాచారం అందించారు.
పాముకి విముక్తి కలిగించిన స్నేక్ క్యాచర్: సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, పాముని పరిశీలించి, అది మింగేశింది కత్తే అని నిర్ధారించారు. కత్తి కొన దాని ఛాతి దగ్గర ఇరుక్కుపోవడంతో కదలేని పరిస్థికి కారణం ఇదే ఉండొచ్చని స్థానికులు అనుకున్నారు. ఆ పదునైన పస్తూవును బయటికి తీయకపోతే పాము చనిపోతుందని భావించారు పవన్. వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అద్వైత భట్ ఇంటికి తీసుకెళ్లారు. అరగంటకు పైగా ప్రయత్నించిన తర్వాత కోబ్రా కడుపు నుంచి కత్తిని బయటకి తీశారు. పాము కోలుకున్న వెంటనే సురక్షితంగా అడవిలో వదిలేశారు.
ప్రియురాలి అంత్యక్రియల్లో ప్రియుడు హల్ చల్- చితిలోకి దూకే యత్నం- చివరికి ఏమైదంటే?
హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్- రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు!