Sitaram Yechury In Critical Condition : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం సీతారం ఏచూరి రెస్పిరేటరీ సపోర్ట్‌పై ఉన్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పార్టీ వెల్లడించింది.
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న సీతారాం ఏచూరి దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు గురువారం ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.