దివ్యాంగ సోదరులపై లైంగిక వేధింపులు- సిగరెట్‌తో కాల్చి, ఐరన్ రాడ్‌తో దాడి
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు- జైలుకు తరలింపు

Published : June 1, 2025 at 8:14 PM IST
Disabled Sexual Abuse Case : మానసిక దివ్యాంగులైన ఇద్దరు సోదరులను లైంగికంగా వేధిస్తున్న పాఠశాల నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు వారిని సిగరెట్లతో కాలుస్తూ, ఐరన్ రాడ్‌తో కొడుతున్నట్లు తేలింది. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ దెహ్రాదూన్‌లో జరిగింది. విద్యార్థుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరోవైపు దీనిపై స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ గీతా ఖన్నా, పాఠశాలను సందర్శించారు. బాలల సంక్షేమ కమిటీ సైతం సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది.
మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళకు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు 13 ఏళ్లు కాగా మరొకరు 9 సంవత్సరాలు. దెహ్రాదూన్‌లోని పటేల్ నగర్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మే మొదటి వారంలో అక్కడికి వెళ్లిన మహిళ, అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. ప్రతి రోజు పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తల్లిదండ్రులకు పంపిస్తామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని నిర్వాహకులు చెప్పారు. వీటిని నమ్మిన మహిళ తన ఇద్దరు కుమారులను ఒక్కరికి రూ. 20వేల చొప్పున చెల్లించి పాఠశాలలో చేర్పించింది.
కొద్ది రోజులు సరిగ్గా ఫొటోలు పంపిన యాజమాన్యం ఆ తర్వాత మానేసింది. దీంతో మే 16న పాఠశాలకు నేరుగా వెళ్లగా పిల్లలను కలిసేందుకు అనుమతించకోపవడంతో వెనుతిరిగింది. అనంతరం శుక్రవారం మరోసారి వెళ్లి పిల్లలను చూడాల్సిందేనని పట్టుపట్టడంతో అనుమతించింది. తల్లిని చూసిన పిల్లలు ఏడవడం ప్రారంభించారు. ఏమైందని ఆరాతీయగా విస్తుపోయే నిజాలు చెప్పారు. పాఠశాల నిర్వాహకుడు తమను రోజూ ఐరన్ రాడ్‌తో కొడతాడని, కడుపులో తన్నుతాడని, సిగరెట్లతో కాలుస్తాడని చెప్పారు. కొన్నిసార్లు లైంగికంగా వేధిస్తాడని పిల్లలు తల్లితో చెప్పుకొచ్చారు.
దీంతో ఆగ్రహించిన మహిళ, నిర్వాహకులను నిలదీయగా సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాఠశాల నిర్వాహకులపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పాఠశాల నిర్వాహకుడిపై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపించినట్లు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ మెస్‌లో మహిళపై అత్యాచారం- వీడియో తీసి బ్లాక్ మెయిల్
మహిళపై గ్యాంగ్ రేప్- ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్- బయటకొచ్చేసిన గర్భాశయం!

