ETV Bharat / bharat

మరోసారి పాక్​ కాల్పుల ఉల్లంఘన- డ్రోన్లతో దాడి - PAK VIOLATES CEASEFIRE

పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘన- డ్రోన్ల దాడి- అడ్డుకున్న భారత్ రక్షణ వ్యవస్థ

Pak Violates Ceasefire
Pak Violates Ceasefire (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2025 at 10:08 PM IST

1 Min Read

Pak Violates Ceasefire : భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్స్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే దాయాది కవ్వింపు చర్యలకు దిగింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్‌లో పాక్‌ నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లో అధికారులు బ్లాక్‌ అవుట్‌ను అమలు చేస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు సైన్యం పేర్కొంది. ప్రస్తుతం డ్రోన్లు ఏమి లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. సాంబా, కతువా, రాజోరి, జమ్ములో బ్లాక్​ అవుట్​ అమల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం వైష్ణో దేవి భవన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనంతో పాటు, వైష్ణో దేవి వెళ్ళే మార్గంలో కూడా లైట్ల నిలిపివేసినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్​తో పాటు పంజాబ్​లో బ్లాక్​ అవుట్​ చేశారు. దిల్లీ నుంచి అమృత్​సర్​ విమానాన్ని కూడా దారి మళ్లినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.