- కాలేజీ రోజుల్లో రక్షణ శాఖలో చేరాలని కోరిక
- పరీక్షల్లో ఉత్తీర్ణాలైనా ఫిజికల్ టెస్ట్‌లో నిరాశ
- కష్టపడి పోలీస్ శాఖలో యువతికి ఉద్యోగం
- మహిళా ట్రాఫిక్ పోలీస్ అధికారిణిగా విధులు
- కమిషనరేట్‌లో అత్యుత్తమ అధికారిణిగా అవార్డు
ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నారా? ఒడిశాకు చెందిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ రష్మిరేఖ బిస్వాల్ గురించే. చదువుతున్న రోజుల్లో రక్షణ శాఖలో పనిచేయాలని కలలు కన్న ఆమె, పోలీస్ ఉద్యోగం సంపాదించారు. ఇప్పుడు కటక్ కమిషనరేట్‌లో మహిళా కానిస్టేబుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ నిబద్ధత, క్రమశిక్షణతో ట్రాఫిక్‌ను నిలువరిస్తున్నారు. ఆమె విజిల్ వేస్తే ఏ వాహనమైనా ఆగాల్సిందే. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు, ముఖ్యమంత్రి నుంచి న్యాయమూర్తుల వరకు, హై-ప్రొఫైల్ VVIPల వాహనాలు వచ్చాయంటే ట్రాఫిక్‌ను నిర్వహించాల్సింది ఆమెనే.
గత ఏడాది మరో పోలీస్ అధికారిని వివాహం చేసుకున్న రష్మిరేఖ ఇప్పుడు ఓవైపు కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని కొనిసాగస్తున్నారు. కటక్ జిల్లాలోని మహాంగా బ్లాక్‌లోని ఆనంద్‌పూర్ పంచాయతీకి చెందిన వారు రష్మిరేఖ. ఆమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, తమ్ముడు ఉన్నాడు. ఆమె తమ్ముడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు సోదరీమణులు ఒడిశా పోలీసు శాఖలోనే ఉన్నారు. తండ్రి రైతు. కానీ కుమార్తెలకు ఎందుకు చదివిస్తున్నారని అందరూ అనేవారు. కానీ ఆయన మాత్రం కుమార్తెలను చదివించి పోత్సహించారు.

వారిని చూసిన ఆకర్షితులై!
రష్మిరేఖ చదువుతున్నప్పుడు పాఠశాలో 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల లాంగ్ జంప్, హై జంప్‌లో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవారు. కళాశాల రోజుల్లోనూ క్రీడల్లో కూడా పాల్గొన్నారు. సాలేపుర్ మా మహేశ్వరి కళాశాలలో చదువుతున్నప్పుడు, సైన్యం, పోలీస్ శాఖ చేరడానికి ప్రాక్టీస్ చేస్తున్న వారిని ఆమె ఆకర్షితురాలయ్యారు. అప్పుడే ఆమె రక్షణ శాఖలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రయత్నించినా కుదరలేదు.

రష్మి కల 2018లో నిజమైంది. ఒడిశా పోలీస్ శాఖలో చేరారు. అంతకు ముందు ఆమె రెండుసార్లు CPRPF, SI పరీక్షలకు హాజరయ్యారు. అంగుల్ పోలీస్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు కూడా CPRPF రిటర్నీలో ఉత్తీర్ణురలయ్యారు. కానీ ఫిజికల్ టెస్ట్‌కు వెళ్లలేకపోయారు. ఫలితంగా ఆర్మీలో చేరలేకపోయారు. అయితే పోలీస్ అధికారిణిగా ఉత్తీర్ణత సాధించడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు.
తొలి అధికారిణి ఆమెనే!
రష్మిరేఖకు ఒడిశా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోయారు. పంచాయతీలో పోలీస్ అధికారిణిగా ఉద్యోగం పొందిన మొదటి అమ్మాయి తన కుమార్తె కావడంతో సంతోషపడ్డారు. సర్పంచ్ నుంచి మొదలుకొని చాలా మంది ఆమెను ప్రశంసించారు. అలా ఎంతో మంది గ్రామంలోని అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు రష్మిరేఖ.

దృఢ సంకల్పంతో ఎదుర్కొంటా!
"ట్రాఫిక్ పోలీసు యూనిఫాం ధరించినప్పుడు నా మనస్సు స్వాతంత్ర్య భావనతో నిండి ఉంటుంది. డ్యూటీలో అడ్డంకులు ఎదురైనప్పుడల్లా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటా. మండే వేడి అయినా, కురుస్తున్న వర్షం అయినా, గడ్డకట్టే చలి అయినా, పరిస్థితితో సంబంధం లేకుండా నిరంతరాయంగా ట్రాఫిక్‌ను నిలువరిస్తా. 8 గంటల డ్యూటీ ఎప్పుడు ముగుస్తుందో నాకే తెలియదు" అని రష్మిరేఖ చెప్పారు.

"ఖాన్ నగర్ స్క్వేర్ వద్ద జరిగిన ఒక ప్రమాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తల్లీకూతుర్లు ప్రమాదానికి గురయ్యారు. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మూడేళ్ల పాప ఏడుస్తూ కూర్చుంది. అది నాకు చూసి చాలా బాధ అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించాను. అప్పుడు నా వైట్ కలర్ యూనిఫామ్ రక్తంతో నిండిపోయింది. ఆస్పత్రికి వెళ్లిన గంటవరకు తల్లి స్పృహలోకి రాలేదు. అప్పుడు ఆ పాపను నేనే పట్టుకున్నాను. కాసేపటికే ఆమె కుటుంబసభ్యులు వచ్చారు. నన్ను ప్రశంసించి, ఆశీర్వించారు" అని రష్మిరేఖ వెల్లడించారు.