Rajastan Youth Drowned in Banas River: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బనాస్ నదిలో స్నానం చేయడానికి వెళ్లి 11 మంది యువకులు అందులో మునిగిపోయారు. వీరిలో 8మంది యువకులు మరణించారని, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని టోంక్ ఎస్పీ వికాస్ సంగ్వాన్ పేర్కొన్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, విహారయాత్రకు వచ్చిన 11 మంది యువకులు స్నానం చేయడానికి బనాస్ నదిలో దిగారు. అకస్మాత్తుగా ప్రవాహం పెరిగింది. దీంతో ప్రవాహంలో చిక్కుపోయిన వారు, అందులోనే మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే, స్థానిక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. స్థానిక గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందం సహాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
8 మంది చనిపోయారని, ముగ్గురు సురక్షితంగా రక్షించామని వారి పరిస్థితి స్థిరంగా ఉందని ఎస్పీ తెలిపారు. విహార యాత్రకు వచ్చిన యువకులందరూ జైపూర్ నివాసితులుగా చెబుతున్నారు. సంఘటన సమాచారం అందిన వెంటనే, జైపూర్ కలెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ సోని టోంక్‌కు బయలుదేరారు.
ఈ సంఘటనపై సీఎం భజన్‌లాల్ శర్మ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. బనాస్ నదిలో మునిగి యువకులు మరణించడం చాలా విచారకరమన్నారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశానని, సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్- రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు!
ప్రియురాలి అంత్యక్రియల్లో ప్రియుడు హల్ చల్- చితిలోకి దూకే యత్నం- చివరికి ఏమైదంటే?