PM Modi On Operation Sindoor : గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్స్‌కు భయపడేది లేదనన్నారు. భారత రక్షణదళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానికమని చెప్పిన మోదీ వారికి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రసగింస్తున్న ప్రధాని మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు.
'రక్షణ దళాల ధైర్యసాహసాలు దేశానికే తలమానికం'
'పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారు. కుటుంబసభ్యుల ముందే దారుణంగా కాల్చి చంపారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్. ఉగ్ర దాడులకు ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో ఏడో తేదీ రాత్రి భారత్ చూపించింది. నిఘావర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది. భారత రక్షణదళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానికం' అని నరేంద్ర మోదీ అన్నారు.
#WATCH | #OperationSindoor | In his address to the nation, PM Modi says, " on 22 april, in pahalgam, the barbarism that terrorists have shown have shaken the country and the world. those innocent people who were celebrating the leaves were killed in front of their families, after… pic.twitter.com/e55EfVi460
— ANI (@ANI) May 12, 2025
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత్ : మోదీ
'పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో మన మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధవిమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని కల్పించింది. దాయాది మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధిచెప్పింది. పాకిస్థాన్ అణు బ్లాక్‌మెయిలింగ్ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుంది. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ చవిచూసింది. సాంకేతిక యుద్ధంలో భారత్ పరిణతి, ఆయుధ సంపత్తిని ప్రదర్శించంది. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలంగా, శక్తివంతగా ఉన్నాయో చాటింది. ఎంత శక్తిమంతమైనవో చాటింది. పాక్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా భారత్ చావుదెబ్బ కొడుతుంది'అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
'ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని దెబ్బ'
'ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా దెబ్బతీశాం. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులకు భారత్ తానేం చేస్తుందో చెప్పింది. పాతికేళ్లుగా పాక్‌లో విచ్చలవిడిగా ఉగ్రవాదులు తిరుగుతున్నారు. పాక్‌లోని ఉగ్రతండాలను భారత్ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టింది. పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న వారిని తుదముట్టించాం. భారత్ దెబ్బకు పాకిస్థాన్ నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయింది. భారత్ దెబ్బతో పాకిస్థాన్ అచేతనావస్థకు చేరుకుంది. ఎటూ పాలుపోని పాక్, భారత్‌లోని జనావాసాలపై దాడికి దిగింది. భారత్‌లోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. భారత్ ప్రతిచర్యలకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. కాల్పుల విరమణ కోసం పాక్ ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరుగెత్తుకుంటూ వచ్చారు. భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.ఉగ్రవాదంపై భారత్ వైఖరిని మన ప్రతిచర్యలే స్పష్టం చేశాయి. సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ మన వైఖరిని స్పష్టం చేశాయి' అని మోదీ అన్నారు.
VIDEO | PM Modi (@narendramodi) addresses the nation on 'Operation Sindoor':
— Press Trust of India (@PTI_News) May 12, 2025
" we have seen the country's capabilities and self-restraint in the last few days. first of all, i would like to salute our armed forces, intelligence and our scientists on behalf of every citizen," he… pic.twitter.com/8s1YnOVVla
పాక్‌కు మోదీ సీరియస్ వార్నింగ్
ఇది యుద్ధాల కాలం కాదని, ఉగ్రవాదానిది అంతకన్నా కాదని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్ వెనుకాడదని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని అన్నారు. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకాకలంలో ఉండవని, అలానే ఉగ్రవాదం, వాణిజ్యం కూడా ఉండవని తెలిపారు. ఉగ్రవాదం, నీటి పంపిణీ రెండూ ఏకాకలంలో ఉండవని పాకిస్థాన్‌కు ప్రధాని గట్టిగా హెచ్చరికలు పంపారు. పాకిస్థాన్‌తో చర్చలు అంటూ జరిగితే పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌పై మాత్రమే ఉండాలని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ తప్ప ఏ అంశంపైనా చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలని స్పష్టం చేశారు.
VIDEO | PM Modi (@narendramodi) addresses the nation on #OperationSindoor: " any dialogue with #Pakistan will focus only on terrorism. If talks are held, they will be about Pakistan-Occupied Kashmir (PoK) — nothing else"
— Press Trust of India (@PTI_News) May 12, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos… pic.twitter.com/834kcnZlJz