PM Modi Speech At JK : కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశం పర్యాటకానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పేదలపై పాక్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తద్వారా ఇక్కడి పేదల పొట్టగొట్టాలని పాక్ చూస్తోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రధాని స్పష్టం చేశారు. పాక్ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉంటుందన్నారు. కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకారమైందని మోదీ అన్నారు. చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. భారతీయ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనం కొడియాడారు.
#WATCH | Katra, J&K | Prime Minister Narendra Modi says, " ... unfortunately, our neighbouring country is against humanity and even the livelihood of the poor. what happened in pahalgam on 22 april is an example of this. pakistan attacked both 'insaniyat and kashmiriyat' in… pic.twitter.com/m2sP4VubzT
— ANI (@ANI) June 6, 2025
కశ్మీర్ అభివృద్ధే మా ధ్యేయం!
"మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం వల్ల జమ్మూకశ్మీర్‌ను మరింత అభివృద్ధి చేసుకుంటున్నాం. దాదాపు రూ.40వేల కోట్లతో జమ్మూలో అభివృద్ధికి బాటలు వేశాం. బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక నేటికి కార్యరూపం దాల్చింది. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జ్, అంజిర్ వంతెనలు జాతికి అంకితం చేశాం. మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చేసి చూపించాం. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింతగా కొంత పుంతలు తొక్కుతుంది."
- ప్రధాని మోదీ
మాటల్లో కాదు - చేతల్లో చేసి చూపించాం
జమ్మూకశ్మీర్ సహా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పేదలను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు.
"జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లలో 5 కొత్త వైద్య కళాశాలు ప్రారంభించాం. దీనితో మెడికల్ సీట్లు 500 నుంచి 1300కు పెరిగాయి. మా హయాంలో 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది ప్రజలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఎన్డీఏ హయంలో 50 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. స్వచ్ఛభారత్ కింద 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. జల్‌జీవన్ మిషన్ కింద 12 కోట్ల ఇళ్లకు వాటర్ కనెక్షన్ ఇచ్చాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏకంగా 10 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం."
- ప్రధాని మోదీ
ఉగ్రవాదానికి భారత్ తలవంచదు: మోదీ
ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్‌కు ఓటమి గుర్తుకువస్తుందన్నారు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. అయితే ఈ పోరాటంలో జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి అదనంగా రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం రూ.1 లక్ష ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
#WATCH | Katra, J&K | PM Narendra Modi says, " ... while walking on the chenab and anji bridges today, i lived the lofty aspirations of india and the skill and courage of our engineers and workers." pic.twitter.com/tHvECGDotm
— ANI (@ANI) June 6, 2025
చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ- జాతికి అంకితం
సీఎం యోగి బర్త్‌డే వేళ హిందూ మతంలోకి ముస్లిం యువతి- ఆలయంలో ప్రేమికుడితో పెళ్లి