ETV Bharat / bharat

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​పై 15లక్షల సైబర్​ దాడులు- ఇతర దేశాలతో కలిసి పాకిస్థాన్​ దుస్సాహసం! - CYBER ATTACKS ON INDIA

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​పై భారీ సైబర్​ దాడులు - దాదాపు 15 లక్షల సైబర్​ ఎటాక్​లు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడి

Cyber Attacks On India
Cyber Attacks On India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2025 at 8:36 AM IST

Updated : May 13, 2025 at 8:46 AM IST

1 Min Read

Cyber Attacks On India : భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణతో ఉద్రిక్తతలు తగ్గినా, ఇండియాపై సైబర్‌దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్​మెంట్​ తాజాగా తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో 15 లక్షల సైబర్‌ దాడులు జరిగినట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ దాడుల్లో 150 విజయవంతమైనట్లు పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్​ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు తెలిపారు.

పహల్గాం ఉగ్రదాడి జరిగిన (ఏప్రిల్ 22) తర్వాత భారీస్థాయిలో డిజిటల్ దాడులు పెరిగాయని మహారాష్ట్ర సైబర్‌ నేరాల నియంత్రణ విభాగం సీనియర్‌ అధికారి మీడియాకు ఒకరు తెలిపారు. భారత్​కు చెందిన వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్‌, పశ్చిమాసియా, ఇండోనేసియా హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు వెల్లడించారు. "

"హ్యాకర్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారు. విమానయానం, మున్సిపల్ సిస్టమ్స్‌, ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. భారత్‌-పాకిస్థాన్ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్‌ దాడులు పూర్తిస్థాయిలో తగ్గలేదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి ఈ సైబర్‌ దాడులు ఎదురవుతూనే ఉన్నాయి" ఆ సీనియర్ అధికారి తెలిపారు.

మరోవైపు, మహారాష్ట్రలో సైబర్ డిపార్ట్‌మెంట్‌ నోడల్ ఆఫీస్​గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. సైబర్ నేరాల దర్యాప్తు, భద్రతా నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు అధికారులు. సైబర్‌ దాడులకు గురైతే బాధితులు 1945, 1930 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

పాకిస్థాన్‌కు పీడకలగా 'డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్'- దీని ప్రత్యేకతలు ఇవే?

ఉగ్రవాదులకు ఊహించని చావుదెబ్బ-పాక్ న్యూక్లియర్​ బ్లాక్​మెయిల్స్​కు భయపడేది లేదు : మోదీ

Last Updated : May 13, 2025 at 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.