ETV Bharat / bharat

'ఆపరేషన్ సిందూర్' వేళ పాక్​ డ్రోన్లు భారత్​కు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదు : సీడీఎస్ అనిల్ చౌహాన్

దిల్లీలో UAV & C-UAS స్వదేశీకరణపై జరిగిన ఎగ్జిమిషన్ కమ్ వర్క్​షాప్- పాల్గొన్న సీడీఎస్ అనిల్ చౌహాన్​

CDS Anil Chauhan On Operation Sindoor
CDS Anil Chauhan On Operation Sindoor (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : July 16, 2025 at 11:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

CDS Anil Chauhan On Operation Sindoor: ఆపరేషన్ సింధూర్​ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లును ఉపయోగించిందని, అవి భారత డిఫెన్స్ వ్యవస్థకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు. పాక్​ ఉపయోగించిన ఆ డ్రోన్లను చాలావరకు స్వదేశీ టెక్నాలజీతో నిర్మూలించామని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రోన్లు ఒక మిలిటరీ సాధనంగా మారాయని వివరించారు. నిన్నటి ఆయుధ వ్యవస్థలతో నేటి యుద్ధాన్ని గెలవలేమని అన్నారు. నేటి యుద్ధాన్ని రేపటి సాంకేతికతోనే పోరాడాలని చెప్పారు. దిల్లీలో జరిగిన UAV & C-UAS స్వదేశీకరణపై జరిగిన వర్క్​షాప్​లో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు.

'ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని ఉపయోగించింది. వాటిలో ఏదీ కూడా భారత్​ సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలపై ఎటువంటి నష్టం కలిగించలేదు. చాలా వరకు కైనిటిక్‌, నాన్ కైన‌టిక్ ప‌ద్ద‌తుల్లో ఆ డ్రోన్ల‌ను కూల్చివేశాం. కొన్ని డ్రోన్ల‌ను రిక‌వ‌రీ చేశాం. ఇక డ్రోన్ల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యుద్ధంలో పరిణామాత్మక మార్పును తీసుకువస్తున్నాయా? లేదా? అని ఆలోచించాల్సి వస్తుంది. డ్రోన్ల వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధి ఓ పరిణామాత్మక ప్రక్రియ కాగా, వాటి వినియోగం మాత్రం యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. డ్రోన్ల వినియోగ సామర్థ్యం పెరిగినా కొద్దీ, భారత్​ సైన్యం వాటిని విప్లవాత్మకంగా ఉపయోగించడం ప్రారంభించాయి. ఇటీవల కాలంలో జ‌రుగుతున్న యుద్ధాల్లో డ్రోన్ల ప‌నితీరును ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం' అని చౌహాన్ అన్నారు.

విదేశీ సాంకేతికపై ఆధారపడటం ప్రమాదకరం : అనిల్ చౌహాన్
'దేశీయంగా అభివృద్ధి చేసిన కౌంటర్-యూఏఎస్​ వ్యస్థలు ఎందుకు కీలకమో ఆపేరషన్ సిందూర్ మనకు స్పష్టం చేసింది. మనల్ని మనం రక్షించుకోవడానికి స్వదేశీ సామర్థ్యాల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వాటిని నిర్మించుకోవాలి. రక్షణ, దాడి లక్ష్యాల కోసం కీలకంగా మారిన ఈ వ్యవస్థల విషయంలో మనం పూర్తిగా విదేశీ సాంకేతికతపై ఆధారపడలేం. ఆపరేషన్ సిందూర్ సమయంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో స్పష్టంగా తెలిసింది. వాటిపై ఆధారపడితే అది మన సన్నద్ధతను బలహీనపరుస్తుంది. ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. అలాగే అవసరమైనప్పుడు విడిభాగాల కొరతకు దారితీస్తుంది. అంతేకాకుండా, విదేశీ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. దీంతో ప్రత్యర్థులు ఈ వ్యవస్థల సామర్థ్యం ఆధారంగా మన వ్యూహాలను అంచనా వేయగలరు' అని సీడీఎస్ చౌహాన్ అన్నారు.

'భారత్​కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?'- ఆపరేషన్​ సిందూర్​పై అజిత్​ ఢోబాల్

ఆపరేషన్​ సిందూర్​తో మన రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది : రాజ్​నాథ్ సింగ్