Jammu Kashmir Terrorist Attack : జమ్ము కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్థాన్ పౌరులు వెంటనే భారత్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ పర్యటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆ దేశ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అటు పాక్ హైకమిషనర్‌ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు చెప్పిన కేంద్రం ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ఈ ఉదయం దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉగ్రదాడి తర్వాత పరిస్థితులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
VIDEO | Union Home Minister Amit Shah (@AmitShah) arrives at PM Modi's (@narendramodi) official residence at 7 Lok Kalyan Marg.
— Press Trust of India (@PTI_News) April 23, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/C8B0nD0JbL
ప్రధాని మోదీ సూచన మేరకు మంగళవారం శ్రీనగర్ వెళ్లిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బుధవారం ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లారు. శ్రీనగర్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్‌కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉగ్రదాడి జరిగిన తీరును అమిత్ షాకు అధికారులు వివరించారు. అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి ఆయన నివాళులర్పించారు. అక్కడే బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Delhi | Prime Minister Narendra Modi chairs meeting of Cabinet Committee on Security (CCS).
— ANI (@ANI) April 23, 2025
Union HM Amit Shah, Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar and others officials are present. pic.twitter.com/zXv9TohVz3
'గట్టిగా బదులిస్తాం'
అంతకుముందు పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. త్వరలోనే ఉగ్రదాడిలో పాల్గొన్న వారికి, కుట్రను అమలుచేసిన వారికి గట్టిగా బదులిస్తామన్నారు. పెహల్గాం ఉగ్రదాడిని అమానవీయ ఘటనగా పేర్కొన్న ఆయన, దేశ పౌరులందరికీ తీవ్రమైన బాధ, దు:ఖం కలిగించిందన్నారు. ఇలాంటి ఉగ్రదాడులతో భారత్‌ను భయపెట్టలేరని స్పష్టం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్న ఆయన, ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, దీనిని ఎదుర్కోవడంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు.
#WATCH | Delhi: Raksha Mantri Rajnath Singh leaves from his residence and heads to 7 LKM, Prime Minister Narendra Modi's residence, for a meeting of the Cabinet Committee on Security.#PahalgamTerrorAttack pic.twitter.com/jFHe5xNarV
— ANI (@ANI) April 23, 2025