Operation Sindoor Details : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్లో 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి చెందారని వెల్లడించింది. సుమారు 90 మంది పాక్ సైనికులకు గాయాలయ్యాయని పేర్కొంది.
మరోవైపు, దాయాది దేశంతో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల్లో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.