ETV Bharat / bharat

ఇకపై ఆధార్ అథంటికేషన్​తోనే తత్కాల్​ టికెట్స్​ బుకింగ్- రైల్వే శాఖ నిర్ణయం - TATKAL BOOKING TICKETS ANNOUNCEMENT

తత్కాల్ టికెట్స్​ బుకింగ్​ ఇక మరింత ఈజీ- అధార్​ అథంటికేషన్​ తప్పనిసరి- జూలై 1 నుంచే ప్రారంభం

IRCTI
IRCTI (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : June 11, 2025 at 4:37 PM IST

Updated : June 11, 2025 at 5:27 PM IST

2 Min Read

Tatkal Tickets Booking Announcement : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత ఈజీ కానుంది. జూలై 1 నుంచి ఆధార్​ అథంటికేషన్ కలిగిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేలా రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల ప్రయోజనాల్ని నిజమైన వినియోగదారులకు మాత్రమే అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

"2025 జూలై 1 నుంచి ఆధార్ అథంటికేషన్​ కలిగిన యూజర్లు మాత్రమే తత్కాల్​ టికెట్లు బుకింగ్ చేసుకోగలుగుతారు. ఇందుకోసం వారు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్​సైట్​/యాప్​లను ఉపయోగించుకోవచ్చు" అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఓటీపీ తప్పనిసరి
2025 జూలై 15 నుంచి తత్కాల్​ టికెట్ల బుకింగ్​ కోసం ఆధార్​ ఆధారిత ఓటీపీ అథంటికేషన్ కూడా తప్పనిసరి అని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.

"తత్కాల్ టికెట్లు కంప్యూటరైజ్డ్​ పీఆర్​ఎస్​ (ప్యాసింజర్​ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు బుకింగ్ సమయంలో సిస్టమ్-జనరేటెట్ ఓటీపీని కచ్చితంగా ఎంటర్ చేసి, అథంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025 జూలై 15 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. "
- రైల్వే మంత్రిత్వ శాఖ సర్క్యులర్​

ఏజెంట్లకు నో ఛాన్స్​!
తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల వరకు రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా రైల్వే మంత్రిత్వ శాఖ పరిమితి విధించింది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఎయిర్ కండిషన్డ్​ తరగతులకు, ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు నాన్​ ఎయిర్ కండిషన్డ్ తరగతులకు ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.

ఈ కొత్త వ్యవస్థకు అవసరమైన మార్పులు చేయాలని, ఈ మార్పులను అన్ని జోనల్ రైల్వేలకు తెలియజేయాలని రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్​ సెంటర్​ (CRIS), IRCTCలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేకాదు ఈ నూతన మార్పుల గురించి సాధారణ ప్రజలకు తెలియజేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా విస్తృతంగా ప్రచారంచేయాలని సర్క్యులర్​లో పేర్కొంది.

UTSలో ట్రైన్​ టికెట్ బుకింగ్ మరింత ఈజీ- ఇక ఎక్కడ నుంచైనా! - UTS App Distance Restriction

తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? - ఇలా చేశారంటే మీ టికెట్ ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది! - IRCTC Tatkal Ticket

Last Updated : June 11, 2025 at 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.