ETV Bharat / bharat

దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? ప్రభుత్వం ముందున్న సవాళ్లివే! - One Nation One Election India

One Nation One Election Challenges :జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం వల్ల దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. అసలు సాధ్యం కాదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, ఎన్​డీఏ మాత్రం ఈ విడతలోనే అమలు చేస్తామని చెబుతోంది. అసలు జమిలి ఎన్నికలు అమలు చేయాలంటే ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటో చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 7:53 AM IST

One Nation One Election India
One Nation One Election India (ETV Bharat)

One Nation One Election Challenges : కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలి ఎన్నికల సాధ్యంపై మోదీ ప్రభుత్వం ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్​డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలి కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.

రాష్ట్రాల అసెంబ్లీ గడువు
జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. ఇదేమీ భారదేశానికి కొత్తేం కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి.

రాజ్యాంగ సవరణలు చేయాలి
దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1 )ని సవరించాలి. అత్యయిక పరిస్థితుల సమయంలో సభకాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరించాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85 ‍(2) (బి‌) ని సవరించాలి. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దఖలు పరిచే ఆర్టికల్ 174‍ ( 2) ( బి‌ )కి సవరణలు చేయాలి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాలి. ఈ రాజ్యాంగ సవరణలను పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

రాష్ట్రాలు ఆమోదం అవసరం
లోక్‌సభలో ప్రస్తుతం ఎన్​డీఏకు 293 ఎంపీల బలముంది. జమిలి ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఎన్​డీఏకు బలం 121 కాగా జమిలి ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మాటకూ విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలికి సరేననాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్​డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు, జమిలి ఎన్నికల విధానాన్ని అమలుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఎన్​డీఏ సర్కార్ ఎలా అమలు చేస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది.

1951-2019 వరకు ఎలా జరిగాయంటే?

  • 1951-52, 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి ఏర్పాటుకు వీలుగా బిహార్, బొంబాయి, మద్రాస్, మైసూర్, పంజాబ్, యూపీ, పశ్చిమబెంగాల్‌ శాసనసభలను వాటి పదవీకాలం ముగియకముందే రద్దుచేశారు.
  • 1961-70 వరకు బిహార్, కేరళ, పంజాబ్, యూపీ, బంగాల్‌లలో మూడేసి సార్లు ఎన్నికలు జరిగాయి.
  • 1971-80 వరకు ఈ పదేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది. ఏకంగా 14 రాష్ట్రాల్లో మూడేసి సార్లు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఒడిశాలోనైతే నాలుగుసార్లు జరిగాయి.
  • 1981-90 వరకు ఐదు రాష్ట్రాల్లో మూడుసార్లు చొప్పున ఎన్నికలు నిర్వహించారు.
  • 1991-2000 వరకు రెండు రాష్ట్రాల్లో మూడుసార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఏకంగా నాలుగుసార్లు ఎన్నికలకు వెళ్లింది.
  • 1983 సంవత్సరంలో ఎన్నికల సంఘం వార్షిక నివేదిక జమిలి ఎన్నికల ఆలోచనను తెరపైకి తెచ్చింది.
  • 2002లో వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ బదులు ఏకకాలానికి మారాలని ‘రాజ్యాంగ పనితీరుపై సమీక్షకు నియమితమైన జాతీయ కమిషన్‌ కోరింది. 1999, 2015, 2018లలో లా కమిషన్‌ కూడా ఒకేసారి ఎన్నికలకు సిఫార్సు చేసింది.
  • 2015లో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖల స్థాయీ సంఘం సమగ్రంగా అధ్యయనం చేసి, రెండు దశల్లో ఏకకాల ఎన్నికల పూర్తికి ఆచరణాత్మక విధానాలు సూచించింది.
  • 2017 జనవరిలో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడంపై విశ్లేషణకు నీతిఆయోగ్‌ వర్కింగ్‌పేపర్‌ను రూపొందించింది.
  • 2019లో పాలనా సంస్కరణలపై దిల్లీలో అఖిలపక్ష సమావేశంలో చర్చ జరిగింది. ప్రధానాంశాల్లో ఒకటిగా జమిలి ఎన్నికలు ఉన్నాయి.

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం- శీతాకాల సమావేశాల్లో బిల్లు! - One Nation One Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.