ETV Bharat / bharat

ప్రజా సంక్షేమానికే NDA ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రధాని మోదీ - PM MODI NDA GOVERNMENT

ఎన్​డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే అంకితభావంతో కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ పోస్ట్

PM Modi NDA Government
PM Modi NDA Government (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 5, 2025 at 11:04 AM IST

1 Min Read

PM Modi NDA Government : బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుందని, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

'ప్రతి పౌరుడు గౌరవంగా జీవించేలా ​దేశాన్ని నిర్మించడానికే ఎన్​డీఏ కట్టుబడి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక పథకాలన్నీ పేదల జీవితాలను మార్చాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్​ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్​ వంటి పథకాలు గృహనిర్మాణం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల, డీబీటీ, డిజిటల్ విప్లవం వంటివి ప్రతి ఒక్కరికి చేరేలా పథకాలను తీసుకొచ్చాం. దీని కారణంగా 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక జూన్ 9 నాటికి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి 11ఏళ్ల పూర్తి అవుతుంది. ఈ 11 ఏళ్లల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్​ చేయడాని ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వేళ సంక్షేమ పథకాల గురించి ప్రధాన మోదీ ఈ మేరకు పోస్ట్ చేశారు.

బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులంతా పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు వేగంగా పని చేయాలని ప్రధానమోదీ సూచించారు. ప్రజలను చేరుకోవడంలో ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్​ చేయాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.