ETV Bharat / bharat

లవర్​ కోసం కన్న కొడుకును చంపిన కసాయి తల్లి- దారంతో గొంతు నులిమి ఆపై! - MOTHER KILLED SON

తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని కుమారుడి హత్య

Mother Killed Son
Mother Killed Son (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2025 at 11:10 AM IST

2 Min Read

Mother Killed Son : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో కన్న బిడ్డనే కడతేర్చింది ఓ కసాయి తల్లి. తన నాలుగేళ్ల కుమారుడిని దారంతో గొంతు నులిమి ఆ తర్వాత శరీరం భాగాలపై గాయపరిచి హత్య చేసింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్​లో జరిగింది. బాధితుడి తండ్రి సుశీల్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనీషానే హంతకురాలిగా గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్పుర్​ గ్రామానికి చెందిన సుశీల్, మనీషా దంపతులు. అయితే, మనీషాకు వికాస్​ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి అడ్డుగా వస్తున్నాడని కుమారుడిని అంతమొందిచాలని మనీషా భావించింది. పధకం ప్రకారం తన కొడుకుని దారంతో గొంతు నులిమి చంపేసింది.

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి జీవించడానికి తన కుమారుడు అడ్డుగా వస్తున్నాడని, అతడిని అంతమొందిచినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడిని చంపినందుకు ఆమె మోహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనపడలేదన్నారు. అంతేకాకుండా ఆ మహిళా తాను ఇదివరకే ఇద్దరు పిల్లల్ని కోల్పోయినట్లు తమ విచారణలో తెలిందన్నారు. కుమారుడి మరణం తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకొని జీవించాలని వారిద్దరూ భావించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనీషా ప్రియుడు వికాస్​ను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఘటన తర్వాత వికాస్​ పరారీలో ఉండగా, అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి నార్వల్​వద్ద వికాస్​ తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసుల చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. అతడ్ని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నార్వల్​ పోలీస్​స్టేషన్​ ఇన్​చార్జి రామ్​ మురాఠ్​ పటేల్​ చెప్పారు. కాగా, విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు.

అంతా గూగుల్ మ్యాప్స్ దయ- తొమ్మిదేళ్ల వయసులో మిస్సింగ్- 38ఏళ్ల ఏజ్​లో పేరెంట్స్ వద్దకు

పిల్లలు పుట్టడంలేదని కోడలిని రాయితో కొట్టి చంపిన అత్తామామలు- పక్కా ప్లాన్​తో దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.