Mirzapur Man Urinated Friends Neck : స్నేహం కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుల గురించి మనం వింటూ ఉంటాం. కానీ దీనికి విరుద్ధంగా మైకంతో పడిపోయిన స్నేహితుడిపై, ఓ వ్యక్తి అందరూ చూస్తుండగా మూత్రం పోసిన జుగుప్సాకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో జరిగింది. దీనిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఇది కాస్త వైరల్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం, ఆ వీడియోలో ఉన్న యువకులు ఇద్దరూ స్నేహితులు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్, మీర్జాపుర్ జిల్లా, అదాల్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు వేర్వేరు గ్రామాలకు చెందినవాళ్లు. వారిద్దరూ మద్యం తాగడం కోసం బైక్‌పై బేలా అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ వాళ్లు ఫుల్‌గా మద్యం తాగి బయటకు వచ్చారు. ఇంతలో ఒకతను మద్యం మత్తులో పుట్‌పాత్‌పై వెల్లకిలా పడిపోయాడు. అయితే తన స్నేహితుడిని లేపడానికి బదులుగా, ఆ రెండో వ్యక్తి అతి జుగుప్సాకరమైన పని చేశాడు. పడిపోయిన తన స్నేహితుడిపై మూత్రం పోసి, అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో ఆ వీడియో ఫుల్ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చివరకు ఈ విషయం పోలీసుల వరకు చేరింది.
అదాల్‌హట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అమిత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ, 'స్నేహితుడిపై మూత్రం పోసిన వీడియో మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్రంగా విచారణ చేపడతాం. నిందితుడిని కచ్చితంగా పట్టుకుని, అతనికి తగిన శిక్ష పడేలా చేస్తాం' అని అన్నారు.