Maoist Killed In Chattisghar: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సింహాచలం అలియాస్ సుధాకర్(65) మృతి చెందారు. బీజాపూర్ జాతీయపార్కు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 2004లో వైఎస్ ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు.
మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా కేంద్ర బలగాలు బీజాపూర్ అడవులను జల్లెడపడుతున్నాయి. బలగాల సెర్చ్ ఆపరేషన్‌లో సుధాకర్ చిక్కినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ పూర్తిపేరు తెంటు లక్ష్మీనరసింహాచలం. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సింహాచలం ఉన్నారు. సుధాకర్ మారుపేర్లు సింహాచలం, గౌతమ్.
ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో.. పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సిందే!
లొంగిపోయిన మావోయిస్టు సావిత్రి.. దళం సభ్యులకు తెలంగాణ పోలీస్ బాస్ వార్నింగ్