Manish Sisodia in Delhi Excise Policy Case : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2023 ఫిబ్రవరి 26న అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. అవినీతి, మనీలాండరింగ్ అభియోగాలతో నమోదైన కేసుల్లో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన కీలక పరిణామాల క్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- 2023 ఫిబ్రవరి 26 : డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది.
- 2023 మార్చి 9 : సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ అభియోగాలతో సిసోదియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
- 2023 మార్చి 31 : సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
- 2023 ఏప్రిల్ 28 : మనీలాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
- 2023 మే 30 : సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
- 2023 జులై 3 : మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ సిసోదియా వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
- 2023 జులై 6 : మనీలాండరింగ్, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టులో సిసోదియా పిటిషన్ దాఖలు చేశారు.
- 2023 అక్టోబరు 30 : మనీలాండరింగ్, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
- 2024 ఏప్రిల్ 30 : సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది.
- 2024 మే 2 : అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ దిల్లీ హైకోర్టులో సిసోదియా పిటిషన్ వేశారు.
- 2024 మే 21 : సిసోదియాకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు నో చెప్పింది.
- 2024 జులై 16 : బెయిల్ కోసం సిసోదియా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై సీబీఐ, ఈడీ స్పందనను కోరింది.
- 2024 ఆగస్టు 6 : అవినీతి, మనీలాండరింగ్ కేసులలో బెయిల్ కోరుతూ సిసోదియా దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
- 2024 ఆగస్టు 9 : సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆప్ నేత మనీశ్ సిసోదియాకు బెయిల్- 17నెలల తర్వాత! - Manish Sisodia Bail Judgement
Delhi Excise Case : సిసోదియాకు ఈడీ షాక్.. రూ.52 కోట్ల ఆస్తులు అటాచ్!