Manipur Internet Ban : రావణకాష్టంలా రగులుతున్న మణిపుర్‌లో నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం మరోసారి ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించింది. మైతేయ్ నేత అరంబాయి టెంగోల్ అరెస్టు తర్వాత భారీ ఆందోళనలు చెలరేగడంతో 5 జిల్లాల్లో ఐదు రోజుల పాటు వీసాట్, VPN సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో అరాచక శక్తులు సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే చిత్రాలు, విద్వేష ప్రసంగాలు, వీడియో సందేశాలను ప్రసారం చేసే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అంతర్జాలంపై నిషేధం విధించింది.
Manipur | In view of the prevailing law and order situation, internet and mobile data services, including VSAT and VPN, have been suspended in Imphal West, Imphal East, Thoubal, Kakching and Bishnupur districts of Manipur for 5 days with effect from 11.45 PM, June 7 pic.twitter.com/L95SoHjXOf
— ANI (@ANI) June 8, 2025
Manipur | In view of the prevailing law and order situation, prohibitory orders have been issued by District Magistrates of Imphal West, Imphal East, Thoubal, Kakching and Bishnupur districts. Citizens are requested to cooperate with the orders.
— ANI (@ANI) June 8, 2025
The assembly of four or more… pic.twitter.com/E8TpPN4WwX
మైతేయి నాయకుడు అరంబాయి టెంగోల్ అరెస్ట్ తర్వాత వెల్లువెత్తిన నిరసనలతో మణిపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీంతో ఇంటర్నెట్ బ్యాన్‌తో పాటు ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు, తౌబల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి టైర్లు, పాత ఫర్నిచర్ తగలబెట్టారు. తమ నేతను విడదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి పలు చోట్ల మైతేయి మద్దతుదారులు, భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురై లామ్‌లాంగ్‌లో ఒక బస్సుకు నిప్పుపెట్టారు. రాజ్‌భవన్ సహా కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
#WATCH | Manipur: Latest visuals from East and West Imphal showing the aftermath of overnight violence that erupted in five districts of the state.
— ANI (@ANI) June 8, 2025
The assembly of four or more persons has been restricted in Imphal West, Imphal East, Thoubal and Kakching districts. A total… pic.twitter.com/x7mmYMurWB
రాష్ట్రపతి పాలనలో మణిపుర్
కాగా, ఇప్పటికే మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మణిపుర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్‌కు దఖలుపరుస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు ఇచ్చారని నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచినట్లు వివరించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు
బీరెన్‌సింగ్ రాజీనామా అనంతరం ఇటీవలె ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త సర్కార్‌ను ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు చెప్పారు బీజేపీ నేతలు. రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసిన తర్వాత మాట్లాడిన బీజేపీ నేత రాధేశ్యామ్, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
ప్రస్తుతం మణిపుర్ శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. అసెంబ్లీలో 60 మంది సభ్యులు ఉండగా, అందులో ఒక స్థానం ఖాళీగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో 44 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 37 మంది బీజేపీకి చెందినవారు ఉన్నారు. మరోవైపు, మే 2023లో జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన హింసలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.