Man Killed by Contract Killer Hired by Wife: ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్ ఘటన మరువకముందే అక్కడ మరొకటి జరిగింది. పెళ్లైన రెండు వారాలకే ప్రియుడి సాయంతో భర్తను చంపించింది ఓ భార్య. ఇందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్‌ను రూ. 2లక్షలకు నియమించుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను పట్టుకున్నారు.
ఇదీ జరిగింది
ఈ నెల 5న ఔరోయాకు చెందిన దిలీప్, ప్రగతిని వివాహమాడాడు. అయితే అప్పటికే ప్రగతి తన గ్రామంలోని మనోజ్ యాదవ్‌తో నాలుగేళ్లుగా ప్రేమలో ఉందని ఎస్పీ తెలిపారు. పెళ్లాయ్యాక కలుసుకోవడానికి వీలులేకపోవడంతో దిలీప్‌ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి వ్యూహ రచన చేసిందని చెప్పారు. కాంట్రాక్ట్ కిల్లర్ రామ్‌జీతో కుదుర్చుకున్న రూ.2 లక్షలు ఒప్పందంలో లక్ష రూపాయలను ప్రగతినే సమకూర్చిందని చెప్పారు. ఇందుకోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన నగలు, కానుకలు విక్రయించిందని తెలిపారు. ఈనెల 19న బాధితుడికి మాయ మాటలు చెప్పి నిందితులు పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి, తుపాకితో కాల్చారని వెల్లడించారు. అనంతరం చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. గాయాలతో ఉన్న దిలీప్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

"మార్చి 19న ఓ వ్యక్తి గాయాలతో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని దిలీప్ యాదవ్‌గా గుర్తించాం. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలోనే అతడు మరణించాడు. దీంతో హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించాం. ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నాం. అతడికి సహాయం చేసిన ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాం."
--అభిజీత్ శంకర్, ఎస్పీ ఔరోయా


#WATCH | Auraiya, UP: Man killed by contract killers hired by wife and her lover.
— ANI (@ANI) March 24, 2025
SP Auraiya, Abhijeet R Shankar says, " ... the police received information about an injured person on 19 march. on receiving information, the police immediately reached the spot and took the… pic.twitter.com/E6917dFKas
ఇటీవలె ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఇలాంటి ఘటన జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాతకంగా హత్య చేసింది. శవాన్ని 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసి కప్పిపెట్టింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
'భర్త సొమ్ముతో ప్రియుడు బెట్టింగ్- ఆ డబ్బుతోనే షికార్లు'- మేరఠ్ హత్య కేసులో కీలక విషయాలు!
'భోజనం వద్దు- మాకు డ్రగ్స్ కావాలి'- మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో నిందితుల డిమాండ్