Man To Jump Into Gfs Funeral Pyre in Maharastra : ప్రియురాలి మరణంతో కలత చెందిన ఓ యువకుడు ఆమె చితిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న మృతురాలి బంధువులు ఆ యువకుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో కామలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు
యువకుడు ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీనికి వారిద్దరి మధ్య ఏర్పడ్డ చిన్న గొడవే కారణంగా తెలుస్తోంది. దీనితో అతను మద్యం సేవించి, ఆ మత్తులో ఆమె అంత్యక్రియలు జరిగే చోటుకు వెళ్లాడు. తరువాత చితిలో దూకడానికి ప్రయత్నించాడు. దీనిని అక్కడున్న వాళ్లు అడ్డుకున్నారు. తరువాత మృతురాలి బంధువులు ఆ యువకుడిని బాగా కొట్టారు. దీనితో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తరువాత యువకుని తండ్రి, సోదరుడు పోలీసుల సాయంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లారు. కన్హాన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. యువకుడు స్పృహలోకి వచ్చిన తరువాత అతని వాగ్మూలం తీసుకుని, తదుపరి దర్యాప్తు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అని పోలీసులు తెలిపారు.
బాలిక కుటుంబంపై యువకుడి బంధువుల దాడి!
మరోవైపు యువకుడి బంధువులు తమపై దాడి చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడని ఆరోపణ- మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య
తల్లి తిట్టిందని యువకుడి ఆత్మహత్య- ఆ బాధలో విషం తాగి అమ్మ, సోదరి కూడా!