Mamata Banerjee on Waqf Violence : వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్‌లో అల్లర్లు ముందస్తు ప్రణాళికతోనే జరిగాయని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందులో బీజేపీ, బీఎస్‌ఎఫ్, ఇతర కేంద్ర ఏజెన్సీల హస్తం ఉందని విమర్శించారు. కోల్‌కతాలో జరిగిన ఇమామ్‌ల సమావేశంలో పాల్గొన్న బెంగాల్ సీఎం మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తేవటంతోపాటు అక్రమ చొరబాట్లకు అనుమతి ఇవ్వటం బంగాల్‌లో అశాంతికి కారణమైనట్లు ఉందన్నారు.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says " they (centre) should answer how many youths have got jobs? the prices of medicines, petrol, and diesel have been increased, but some 'godi media' only speak against bengal. if you have to say something, come and say it in… pic.twitter.com/XLLzYRlYqG
— ANI (@ANI) April 16, 2025
VIDEO | Kolkata: Speaking during a meeting with Muslim religious leaders to discuss Waqf (Amendment) Act 2025, West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) says, " the centre hiked petrol, diesel prices and some 'godi media' speak only against bengal, speak against me. i just… pic.twitter.com/NWDMdwVsvl
— Press Trust of India (@PTI_News) April 16, 2025
వక్ఫ్ చట్టం మూలంగా ముర్షీదాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఇందులో బంగ్లాదేశ్ పాత్ర ఉన్నట్లు హోం శాఖ చెబుతోంది. ఒకవేళ ఇదే నిజం అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సరిహద్దు బాధ్యత బీఎస్‌ఎఫ్ చూసుకోవాలి రాష్ట్రం కాదు. బయట నుంచి వచ్చి అల్లర్లు సృష్టించడానికి బీజేపీ వాళ్లు ఎందుకు అనుమతిని ఇచ్చారు. నేను అన్ని మతాల గురించి మాట్లాడుతాను. కాళీ మాత ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పుడు బీజేపీవాళ్లు ఎక్కడికి వెళ్లారు. మేం దుర్గా పూజ, సరస్వతి పూజ నిర్వహించేటప్పుడు ఇక్కడ చేయనియమని అన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవించాలి. అదే మన సంప్రదాయం. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కానీ గోడీ మీడియా మాత్రం అవేవీ పట్టించుకోకుండా బంగాల్‌కు వ్యతిరేకంగా, నా గురించి మాట్లాడుతున్నాయి. ఏమైనా చెప్పాలనుకుంటే నాకు ఎదురుగా వచ్చి మాట్లాడండి. ఫేక్ న్యూస్ పబ్లిష్ చేయకండి.
--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్ల కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. హింస జరగటానికి బీఎస్‌ఎఫ్‌లోని ఓ వర్గం, కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏజెన్సీల పాత్ర ఉందని దుయ్యబట్టారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా సారథ్యంలోని హోంశాఖను నియంత్రించాలని కోరారు. రాజకీయ అజెండా కోసం అమిత్ షా దేశానికి హాని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.