ETV Bharat / bharat

IRCTC సూపర్​ ప్యాకేజీ - మధ్యప్రదేశ్​లోని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోండి! - Irctc Madhya Pradesh Package

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 2:14 PM IST

IRCTC Tour Package : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఎప్పటికప్పుడు కొత్త టూర్​ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే, తాజాగా మధ్యప్రదేశ్​లోని రెండు జ్యోతిర్లింగాలను చూసేందుకు వీలుగా ఒక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

IRCTC Tour
IRCTC Tour Package (ETV Bharat)

Madhya Pradesh Maha Darshan Irctc Package : మధ్యప్రదేశ్ దేశంలోనే గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో ఒకటి. ఈ రాష్ట్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి ఒకటి ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, రెండోది ఓంకారేశ్వర ఆలయం. అయితే, చాలా మందికి ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ఉంటుంది. కానీ అక్కడికి ఎలా వెళ్లాలి? ఎక్కడ బస చేయాలి? అనే వివరాలు తెలియక ఎంతోమంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. అయితే, ఇలాంటి వారికోసమే.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు సౌకర్యంగా జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC 'మధ్యప్రదేశ్‌ మహా దర్శన్​' (Madhya Pradesh Maha Darshan) పేరుతో ఈ టూర్​ నిర్వహిస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ ద్వారా ఈ టూర్​ స్టార్ట్​ అవుతుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

డే 1:
మొదటి రోజు హైదరాబాద్​ నుంచి మధ్యాహ్నం ఇందౌర్​కు ఫ్లైట్​ స్టార్ట్​ అవుతుంది. అక్కడ పికప్​ చేసుకుని ఉజ్జయినిలోని హోటల్​కి తీసుకెళ్తారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆలయాలను చూసి.. రాత్రికి అక్కడే బస చేస్తారు.

డే 2:
రెండోరోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసి ఉజ్జయినిలో ఉన్న హర్సిద్ధి మాత ఆలయం, సాందీపని ఆశ్రమం, మంగళనాథ్ ఆలయం, చింతామన్ గణేష్ ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అలాగే రెండోరోజు రాత్రి ఉజ్జయినిలో బస చేస్తారు.

డే 3 :
మూడో రోజు కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ చేసి.. ఉజ్జయిని హోటల్​ నుంచి చెక్ అవుట్ అయ్యి మహేశ్వర్ వెళ్తారు. అక్కడ అహల్యా దేవి కోట, నర్మదా ఘాట్ చూస్తారు. అక్కడ నుంచి ఓంకారేశ్వర్‌కు వెళ్తారు. రాత్రి డిన్నర్​ చేసి అక్కడే హోటల్లో​ బస చేస్తారు.

డే 4:
నాలుగవ రోజు హోటల్లో టిఫెన్ చేసి.. ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం హోటల్​ చెక్​ అవుట్​ అయి ఇందౌర్​​కు బయలుదేరతారు. అక్కడ పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని చూస్తారు. రాత్రి ఇందౌర్​లోని హోటల్లో డిన్నర్​ చేసి స్టే చేస్తారు.

5వ రోజు:
చివరి రోజు ఉదయాన్నే హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ చేసి.. అన్నపూర్ణ మందిర్, లాల్ బాగ్ ప్యాలెస్‌ని చూస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి.. సాయంత్రం 4 గంటలకు ఇందౌర్​ విమానాశ్రంలో హైదరాబాద్​ ఫ్లైట్​ ఎక్కుతారు. తర్వాత హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే..

  • సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 32,550లు, డబుల్​ ఆక్యుపెన్సీ రూ. 26,400, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 25,350లను ధరగా నిర్ణయించారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ ఆగస్ట్​ 21 తేదీలో అందుబాటులో ఉంది.
  • ఈ టూర్​కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవి కూడా చదవండి :

షిరిడీ సాయి నాథుని దర్శనంతో పాటు మినీ తాజ్​మహల్​ చూడొచ్చు - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.