Rahul Gandhi On PM Modi : ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయ్యారని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని మోదీని తాను బలవంతం చేశానని ఇప్పటికే ట్రంప్ 11 సార్లు చెప్పారని తెలిపారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మోదీ ఖండించకపోగా మౌనం వహిస్తున్నారని విమర్శించారు.
బిహార్‌లోని నలందాలో సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో రాహుల్ ప్రసంగించారు. SC, ST, OBCలకు చెందిన అధికారులు ప్రశ్నావళిని తయారు చేయకుండా కేంద్రం సమర్థవంతంగా కులగణనను చేస్తుందా అనే అనుమానం వస్తోందన్నారు. NDA నేతృత్వంలోని నీతిశ్ ప్రభుత్వం బిహార్ రాష్ట్రాన్ని భారత్‌కు నేర రాజధాని మార్చిందని మండిపడ్డారు.
ఒకప్పుడు శాంతి, న్యాయంకు మారుపేరుగా ఉండే బిహార్‌ను, NDAనేతృత్వంలోని ప్రభుత్వం నేర రాజధానిగా మార్చేసిందని దుయ్యబట్టారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్ గాంధీ దానిని బిహార్ నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.