Kunal Kamra Shinde Controversy : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ తీవ్రంగా స్పందించారు. కునాల్ తీరును తీవ్రంగా ఖండించారు. "నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు. దిగజారుడు హాస్యంతో డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదు. ఈ వ్యాఖ్యలపై కునాల్ క్షమాపణలు చెప్పాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Maharashtra CM Devendra Fadnavis says, " there is freedom to do stand-up comedy, but he cannot speak whatever he wants. the people of maharashtra have decided who the traitor is. kunal kamra should apologize. this will not be tolerated. there is the right to comedy, but if it is… pic.twitter.com/g7UVXEyfDC
— ANI (@ANI) March 24, 2025
చట్టపరమైన చర్యలు తప్పవ్!
ఉపముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. మరో డిప్యూటీ సీఎం, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. "ఎవరూ చట్ట పరిధి దాటి వ్యవహరించకూడదు. ఎవరైనా హద్దుల్లో ఉండే మాట్లాడాలి. ఒక్కొక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వారి మాటల ద్వారా పోలీసుశాఖ జోక్యం చేసుకొనే పరిస్థితి ఉండకూడదు" అని సున్నితంగా హెచ్చరించారు.
కామెడీ షోలో బ్యాడ్ జోక్స్
ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్‌లోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. "శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది" అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా ఆ కమెడియన్ ఏక్‌నాథ్ శిందేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు.
హోటల్‌పై దాడి
దీనికి సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ 'కునాల్ కా కమల్' అంటూ ఎద్దేవా చేశారు. కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి ఆ షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొంతమంది శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.
#WATCH | Mumbai: Shiv Sena (Eknath Shinde faction) workers vandalised Habitat Comedy Club in Khar after comedian Kunal Kamra's remarks on Maharashtra DCM Eknath Shinde here sparked backlash. (23.03)
— ANI (@ANI) March 24, 2025
Source: Shiv Sena (Eknath Shinde faction) pic.twitter.com/L8pkt0TLM6
#WATCH | Thane, Maharashtra: Members of Yuva Sena (youth wing of Shiv Sena) staged a protest against comedian Kunal Kamra and even burnt his photographs outside Wagle Estate Police Station, after his remarks against Maharashtra DCM Eknath Shinde in a show yesterday. (23.03)… pic.twitter.com/4l3g9Gu0S0
— ANI (@ANI) March 24, 2025
మరోవైపు కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. మొత్తానికి ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. కునాల్ కమ్రా ఎలాంటి తప్పు చేయలేదని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కమ్రా కేవలం తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడని, వాస్తవాలను చెప్పి, ప్రజాభిప్రాయాన్ని వినిపించాడని పేర్కొన్నారు. హోటల్‌పై దాడిని శివసేన UBT నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్ పాడిన పాట 100శాతం వాస్తవమేనన్నారు. అయితే, దాడి ఘటన మాత్రం కుట్ర పూరితమైనదని ఆరోపించారు.
ఆ హోటల్ అక్రమ నిర్మాణమంట!
కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఆందోళనల నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ అధికారులు కామెడీ షో జరిగిన హోటల్ అక్రమ నిర్మాణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఖార్‌లోని స్టూడియోకు సుత్తితో చేరుకుని కూల్చివేతను చేపట్టారు. స్టూడియో ప్రాంగణం రెండు హోటళ్ల మధ్య ఆక్రమణ ప్రాంతంలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.