Indian Army Jobs Wiht JEE Score : ఇండియన్ ఆర్మీలో చేరాలని కలలు కంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత సైన్యం 'టెక్నికల్ ఎంట్రీ స్కీమ్' (టీఈఎస్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విద్యార్హతలు
జేఈఈ మెయిన్ స్కోర్, 10+2 పీసీబీ మార్కులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను టీఈఎస్ కోసం ఎంపిక చేస్తారు. అయితే ఎంపిక విషయంలో జేఈఈ మెయిన్ స్కోర్‌నే ప్రమాణంగా తీసుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అభ్యర్థులు 10+2లో కచ్చితంగా ఫిజిక్స్, కెమిస్టీ, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులను భారత సైన్యంలోని సాంకేతిక శాఖలలో అధికారులుగా చేరడానికి అనుమతిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!
ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 12 లోపు ఆన్లైన్లో టీఈఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై మొదటి వారంలో కటాఫ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
ట్రైనింగ్
ఎంపికైన అభ్యర్థులకు దెహ్రాదూన్‌లో క్యాడెట్ ట్రైనింగ్ ఇస్తారు. తరువాత ఇండియన్ మిలిటరీ అకాడమీలో నాలుగు సంవత్సరాల ప్రీ-కమిషన్ శిక్షణ ఉంటుంది. ఆ తరువాత వారికి ఇంజినీరింగ్ డిగ్రీ ప్రదానం చేస్తారు.
మూడేళ్ల ట్రైనింగ్ పూర్తయిన తరువాత అభ్యర్థులకు స్టైపెండ్ అందిస్తారు. నాలుగేళ్ల శిక్షణ పూర్తయిన తరువాత, వారిని సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు.
జీతభత్యాలు
లెఫ్టినెంట్ హోదాలో నియమితులైన వారికి వార్షిక వేతనం రూ.17-రూ.18 లక్షలు వరకు ఉంటుంది. అంతేకాకుండా వారికి ఉచిత వైద్యం, ప్రయాణ భత్యాలు కూడా అందిస్తారు.
చేయాల్సిన పనులు ఇవే!
టీఈఎస్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు భారత సైన్యంలో ఇంజినీరింగ్, సిగ్నల్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరంగ్ విభాగాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.
పదోన్నతులు
లెఫ్టినెంట్ హోదాతో సైన్యంలో చేరిన అభ్యర్థులు తరువాత క్రమంగా కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్ వరకు పదోన్నతులు పొందవచ్చు. కనుక ఆసక్తి ఉన్న వాళ్లు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
భారత్‌లో గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఎక్స్ ఖాతాలు బ్లాక్- కారణం ఇదే!