'జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి'- పోలీసులకు కోర్టు ఆదేశం

author img

By ETV Bharat Telugu Desk

Published : Feb 13, 2024, 6:53 AM IST

Updated : Feb 13, 2024, 7:08 AM IST

Jayaprada Non Bailable Warrant

Jayaprada Non Bailable Warrant : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటి విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్​ చేసి ప్రజాప్రతినిధుల కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది.

Jayaprada Non Bailable Warrant : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు వరుస షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు, తాజాగా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్​ ఎస్​పీకి ఆదేశాలు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు.

ఇదీ జరిగింది
2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపుర్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కాగా,​ ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

Jaya Prada Cinema Career : కాగా జయప్రద ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ నటుడు కమల్ హసన్​తో కలిసి నటించిన 'సాగర సంగమం' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Jaya Prada Political Career : ఇక సినిమా తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రద. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఎస్​పీలో చేరి, రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్​ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Jayaprada Jail : నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష.. వారి ఫిర్యాదు వల్ల

రూ.10తో కెరీర్​ స్టార్ట్​ - అనతికాలంలోనే స్టార్ హీరోయిన్​గా - ఎవరంటే?

Last Updated :Feb 13, 2024, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.