India on Iran Israel War : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇరుదేశాల విదేశాంగ మంత్రులతో తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ నుంచి తనకు కాల్ వచ్చిందని ఎక్స్‌లో జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కూడా తాజా పరిస్థితిపై చర్చించినట్లు తెలిపారు.
Received a call this afternoon from FM @gidonsaar of Israel regarding ongoing developments.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 13, 2025
Spoke to Iranian FM @araghchi this evening on the latest situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 13, 2025
మోదీ ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్‌కాల్
ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇరాన్‌పై దాడులు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. నెతన్యాహు నుంచి ఫోన్ వచ్చిందని, అక్కడి పరిస్థితిని వివరించినట్లు అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌పై తమ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, మోదీతో పాటు పలు దేశాల నేతలతో ఫోన్లో మాట్లాడారు.
Received a phone call from PM @netanyahu of Israel. He briefed me on the evolving situation. I shared India's concerns and emphasized the need for early restoration of peace and stability in the region.
— Narendra Modi (@narendramodi) June 13, 2025
తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు
మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలపై స్పందించిన ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరుదేశాలకు హితవుపలికాయి. కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్య పద్ధతుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్, ఇరాన్‌లను అభ్యర్థించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడకున్నా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోలేదని రష్యా పేర్కొంది. ఇరుదేశాలూ సంయమనం పాటించాలని కోరింది.
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సౌదీఅరేబియా పేర్కొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని పాకిస్థాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనికాధికారులు మృతి చెందడంపై లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సంతాపం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖండించిన హెజ్బొల్లా తాజా ఘర్షణలో ఇరాన్‌తో చేతులు కలుపుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు.
"నా మాట వినకుంటే ఈ మారణహోమం మరింత దారుణంగా మారుతుంది"- ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్